E-Paper
Advertisement

అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!
Advertisement

Toxic Movie OTT: ప్రముఖ కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న ఈయన కే జి ఎఫ్ 2 తర్వాత సుమారు నాలుగు సంవత్సరాలు విరామం అనంతరం టాక్సిక్ (Toxic)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ గీతు మోహన దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు కూడా సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా మాత్రం ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

జీ 5 లో ప్రసారంకానున్న టాక్సిక్..

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 26వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది. ఇక కలెక్షన్ల పరంగా బాక్సాఫస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుంది.. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల తేదీను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జీ 5 లో ప్రసారం కాబోతుందని తెలియజేశారు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ, తమిళ భాషలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి…

Advertisement

ఈ విధంగా థియేటర్లలో విడుదలైన కేవలం నెలరోజుల వ్యవధిలోనే టాక్సిక్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుంది. మరి డిజిటల్ మీడియాలో అయిన ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందో తెలియాల్సి ఉంది. సాధారణంగా థియేటర్లలో మిశ్రమ స్పందన లభించిన సినిమాలు తరచుగా ఓటీటీలో గ్రాండ్ సక్సెస్ సాధించడం మనం చూస్తూనే ఉంటాం. మరి డిజిటల్ ఆడియన్స్ టాక్సిక్ సినిమాకు ఎలాంటి సక్సెస్ అందిస్తారో వేచి చూడాలి.పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో పొర్చుగీస్ పాలనలో ఉన్న గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది.

నాలుగేళ్ల నిరీక్షణ..

ఈ సినిమాలో అక్రమ దందాలను అదుపు చేసే ఒక ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో యశ్ తన పవర్‌ఫుల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. సుమారు నాలుగు సంవత్సరాల విరామం తర్వత యశ్ నుంచి ఇలాంటి భారీ ప్రాజెక్టు వచ్చిన నేపథ్యంలో అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే టాక్ పరంగా ఈ సినిమాను పక్కన పెడితే సుమారు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టింది .ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ తో కలిపి యశ్ తన సొంత నిర్మాణ సంస్థలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఈయనకు జోడిగా కియారా అద్వానీ నటించారు. ఈ సినిమాలో నయనతార, తారా సుథరియా, రుక్మిణి వసంత్ వంటి తదితర హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

Related News

 పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన పాత ప్రేమికులు… కట్ చేస్తే అడల్ట్రీ స్కాండల్ లో భర్త అడ్డంగా బుక్

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×