E-Paper
Advertisement

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో దిగ్విజయంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఘనంగా పదవ సీజన్ కూడా ప్రారంభమైంది. మొత్తం 10 మంది సెలబ్రిటీలతో 6 మంది కామనర్స్ తో బిగ్ బాస్ సీజన్ 10 ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ 10 మొదటి వారంలో భాగంగా ఏకంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ చైత్ర , చరణ్ లను ఎలిమినేట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ఎలిమినేషన్ చూశాక కంటెస్టెంట్స్ లో కూడా భయం పుట్టింది అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి

టాస్క్ పేరిట ఫిజికల్ గొడవలు..

ఇకపోతే బిగ్ బాస్ అంటే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కానీ కంటెస్టెంట్లు కొట్టుకొని చచ్చే రేంజ్ లో గేమ్స్ పెట్టకూడదు అనే మాటలు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా హౌస్ లో టాస్క్ లో భాగంగా గెలవడానికి కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు పడడం , కొట్టుకోవడం చూస్తుంటే నిజంగా భయం పుడుతోంది అంటూ ఆడియన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మాయి అని కూడా పట్టించుకోకుండా ఈ లాగడాలేంటి?

Advertisement

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. కెప్టెన్సీ రేస్ లో భాగంగా.. లెవెల్ 2 లో భాగంగా ఈ టాస్క్ లో మీరు జంటగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు పోటీ పడబోయేది ఫిజికల్ ఛాలెంజ్ అంటూ ఒక టాస్క్ నిర్వహించారు. బజార్ మోగిన ప్రతిసారి పై నుంచి సంచి పడుతుంది. దానిని పట్టుకోవాలి. పట్టుకొని చివరి వరకు ఎవరైతే సంచిని తమ వద్దే ఉంచుకుంటారో.. అందులోని బాల్స్ ను తర్వాత ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అంటూ టాస్క్ నిర్వహించారు. ఇక రెడ్ అండ్ బ్లూ టీంలో భాగంగా నలుగురు.. రెండు టీంల నుంచి టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో రోహిత్ నాయుడు క్రూరంగా ప్రవర్తిస్తూ టాస్క్ లో పోటీ పడడం అందరికీ భయాన్ని కలిగించింది.

ALSO READ:ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

వినోదం కాదు భయంకరంగా అనిపిస్తోంది..

Advertisement

ముఖ్యంగా రాంప్రసాద్ ను ఎగిరి పట్టుకోవడం.. అమ్మాయి అని కూడా చూడకుండా దేబ్జానీ చెయ్యి పట్టుకొని ఈడ్చేయడం లాంటివి చూస్తుంటే ఇది గేమ్ ఆ లేక ఇంకేదైనానా? ఫిజికల్ ఛాలెంజ్లో మరీ ఇంత అధ్వానంగా భయంకరంగా ప్రవర్తించాలా అంటూ మండిపడుతున్నారు. టాస్క్ పేరిట కంటెస్టెంట్స్ కు ఏదైనా జరిగితే ఎవరు జవాబుదారి అంటూ కూడా మండిపడుతున్నారు. ఏది ఏమైనా రియాలిటీ షోలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కానీ ఇలా హానీ కలిగించదు అంటూ మరొకసారి హెచ్చరిస్తున్నారు. మరి బిగ్ బాస్ లో పెడుతున్న ఆటలలో ఇప్పటికైనా మార్పులు తీసుకొస్తారా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Related News

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

దేబ్జానీ.. ముఖేష్ తో ప్రేమ నిజమేనా?

Big Stories

Advertisement
×