E-Paper
Advertisement

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?

చాటింగ్ సీక్రెట్స్..ఆన్‌లైన్‌లోకి రాకుండానే వాట్సాప్ మెసేలు చదవడం ఎలా?
Advertisement

WhatsApp secret reading hacks: స్మార్ట్‌ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే.. ఒక్కో సారి ఎవరైనా మెసేజ్ చేస్తే.. వారికి బ్లూ టిక్స్ కనిపించకూడదని, అలాగే మనం ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎదుటి వారికి తెలియకూడదని కోరుకుంటాము. కానీ ఈ ట్రిక్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎవరికీ కనిపించకుండా, ఎలాంటి బ్లూ టిక్‌లు పడకుండా వాట్సాప్ మెసేజ్‌లు చాలా ఈజీగా చదివే అద్భుతమైన ట్రిక్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

వాట్సాప్ మెసేజెస్ చదవడం ఎలా?

1. రీడ్ రిసిప్ట్స్ (Read Receipts) ఆఫ్ చేయడం:

వాట్సాప్‌లో బ్లూ టిక్స్ రాకుండా ఉండటానికి ఇదే అత్యంత సులభమైన , అధికారిక మార్గం. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముందుగా మీ ఫోన్ంలో వాట్సాప్ ఓపెన్ చేయండి. తర్వాత రైట్ సైడ్ ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి Settings లోకి వెళ్లండి. అక్కడ Privacy ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఆ మెనూలో ఉండే Read Receipts ఆటోమేటిక్‌గా ఆన్ అయి ఉంటుంది, దానిని Off చేయండి. ఈ సెట్టింగ్ మార్చడం ద్వారా మీరు ఎవరి మెసేజ్ చూసినా వారికి బ్లూ టిక్స్ కనిపించవు. అయితే.. మీ మెసేజ్‌లకు కూడా ఎదుటి వారు చూస్తే బ్లూ టిక్స్ కనిపించవని గమనించాలి.

2. నోటిఫికేషన్ బార్ ట్రిక్ (Notification Panel Trick):

Advertisement

ఎవరికీ తెలియకుండా.. వాట్సాప్ మెసేజ్ చదవడానికి మరొక ట్రెండింగ్ మార్గం నోటిఫికేషన్ ప్యానెల్. మీ ఫోన్‌కు ఎవరైనా మెసేజ్ పంపినప్పుడు, ఫోన్ స్క్రీన్ పైకి స్వైప్ చేసి నోటిఫికేషన్ బార్‌లో ఆ పూర్తి మెసేజ్‌ను చదివేయొచ్చు. ఇలా చేయడం వల్ల మీరు వాట్సాప్ యాప్ లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్టు స్టేటస్ చూపించదు. ఎదుటి వారికి బ్లూ టిక్స్ కూడా పడవు. పెద్ద పెద్ద మెసేజ్‌లను కూడా ఈజీగా చదవడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.

3. మొబైల్ ఏరోప్లేన్ మోడ్ (Airplane Mode) ట్రిక్:

ఒకవేళ మీరు వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి మెసేజ్ చదవాల్సి వస్తే..ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి. మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేదా వైఫై కనెక్షన్‌ను ఆపేయండి లేదా Airplane Mode (ఫ్లైట్ మోడ్) ఆన్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి మీకు వచ్చిన మెసేజ్‌లను పూర్తిగా చదివేయొచ్చు. మెసేజ్ చదివిన తర్వాత వాట్సాప్ యాప్‌ను పూర్తిగా క్లోజ్ చేయండి (రీసెంట్ యాప్స్ నుంచి కూడా తీసేయండి). ఆ తర్వాత ఫ్లైట్ మోడ్‌ను ఆఫ్ చేసి ఇంటర్నెట్ ఆన్ చేయండి. మీరు మెసేజ్ చూసిన విషయం ఎదుటి వారికి అస్సలు తెలియదు.

Advertisement

Also Read: థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ

4. విడ్జెట్ (Widget)వాడుకోవడం:

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు వాట్సాప్ విడ్జెట్‌ను హోమ్ స్క్రీన్‌పై సెట్ చేసుకోవడం ద్వారా కూడా మెసేజ్‌లను చదవవచ్చు. హోమ్ స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేసి విడ్జెట్స్ సెక్షన్‌కు వెళ్లి వాట్సాప్ విడ్జెట్‌ను యాడ్ చేయాలి. దీని వల్ల వాట్సాప్ యాప్ ఓపెన్ చేయకుండానే .. హోమ్ స్క్రీన్ పై నుంచే అన్ని కొత్త మెసేజ్‌లను ఎవరికీ తెలియకుండా చదువుకోవచ్చు.

మనం బిజీగా ఉన్నప్పుడు లేదా కొందరికి వెంటనే.. రిప్లై ఇవ్వలేనప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్ మీకు ఎంతో బాగా సహాయపడతాయి. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించకుండానే.. కేవలం వాట్సాప్‌లో ఉన్న బేసిక్ సెట్టింగ్స్ ,చిన్న ట్రిక్స్ ద్వారా మీ ప్రైవసీని కాపాడుకోవచ్చు. మీరు కూడా ఈ ట్రిక్స్‌ను ట్రై చేసి మీ వాట్సాప్ చాటింగ్ ఫీల్ మరింత ప్రైవేట్‌గా మార్చుకోండి.

Related News

ఫోన్ కెమెరా బాగున్నా ఫోటోలు బాగా రావడం లేదా? ఈ తప్పులు వెంటనే మానేయండి!

ఫ్రిజ్ లైఫ్ పెరగాలంటే.. ఈ చిన్న పని చేయాల్సిందే!

స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ కొనేముందు..ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

డిలీట్ అయిన ఫోటోలు మళ్లీ కావాలా? ఈ సీక్రెట్ సెట్టింగ్ మీ కోసమే

బెస్ట్ బ్లూటూత్ స్పీకర్..ఏఐ సౌండ్‌తో ఇల్లు దద్దరిల్లిపోతుంది

పాత టీవీ రిమోట్ పారేస్తున్నారా? ఈ 6 ట్రిక్స్ తెలిస్తే.. ఇంకెప్పుడు ఆ తప్పు చేయరు!

శాంసంగ్ A18 4G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, ఏఐ టూల్స్.. అదిరిపోయింది మామ!

Big Stories

Advertisement
×