E-Paper
Advertisement

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!
Advertisement

Pandu Master: పండు మాస్టర్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’  (Dhee Dance Show)కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పండు మాస్టర్(Pandu Master) ఇటీవల కాలంలో తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. ఇలా రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకు పూర్తిగా దెబ్బలు తగలడంతో ఈయన ఇప్పటికీ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా పండు మాస్టర్ తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో అభిమానులు ఎంతో విచారం వ్యక్తం చేశారు.

పండు మాస్టర్ కు యాక్సిడెంట్..

పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురి అయి దాదాపు మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు ఈయన బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పండు మాస్టర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానుల కోసం ఒక వీడియోని షేర్ చేశారు ఇందులో భాగంగా ఇప్పటివరకు తనకు సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ అయినా ఇంస్టాగ్రామ్ ద్వారా మాత్రమే అభిమానులతో పంచుకున్నానని తెలిపారు. అయితే తాను కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించానని పండు మాస్టర్ తెలిపారు.

యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన పండు మాస్టర్..

Advertisement

ఇక నుంచి తనకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా ఇంస్టాగ్రామ్ తో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరితో పంచుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఇంస్టాగ్రామ్ లో నన్ను ఆదరించిన విధంగానే యూట్యూబ్ ఛానల్ లో కూడా తనని ఆదరించి తనకు మద్దతు తెలిపాలని అభిమానులను ఈ సందర్భంగా వేడుకున్నారు. ఈ విధంగా పండు మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను అంటూ వీడియో చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ మీరు త్వరగా కోలుకోవాలి, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.

?stkn=MTJhbWQ1N3R3bG85bw%3D%3D

Advertisement

ఈ విధంగా పండు మాస్టర్ చాలా రోజుల తర్వాత అభిమానులను ఉద్దేశించి మీ అందరి మద్దతు కావాలని అడగడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జూన్ నెలలో పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. పండు మాస్టర్ తన బృందంతో కలిసి విజయనగరం తగరపువలసలో ఒక కార్యక్రమాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తన కారులో ఉన్నటువంటి ఒకరికి వామింగ్ అవటంతో కారు పక్కన ఆపారు. ఇలా ఆపిన కారు నుంచి పండు మాస్టర్ కిందకు దిగుతున్న సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ డీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లు పూర్తిగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత నుంచి పండు మాస్టర్ ఇంటికే పరిమితమయ్యారు. తనకు సంబంధించిన అప్డేట్స్ ను ఈయన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకునేవారు. అయితే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా తన కొత్త యూట్యూబ్ ఛానల్ కు మద్దతు కావాలని వేడుకున్నారు.

Also Read: రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

Related News

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

దేబ్జానీ.. ముఖేష్ తో ప్రేమ నిజమేనా?

Big Stories

Advertisement
×