
Meena Daughter Latest Look (Source: Instagram)
Meena Daughter Latest Look: నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90'sలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. భర్త మరణం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మీనా తన కూతురితో కలిసి జీవిస్తోంది.

Meena Daughter Latest Look (Source: Instagram)
అయితే.. నిన్న క్రిస్మస్ సందర్భంగా మీన కూతురు ఒక ఫోటో షేర్ చేసింది. ఇందులో తన తల్లి (మీనా) కూర్చిలో కూర్చుని ఉండగా.. ఆమె కూతురు పక్కన నిలబడి క్యూట్‌గా ఫోటోకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె చూసి అంత షాక్ అవుతున్నారు. ఏంటీ? మీనా కూతురు అప్పుడే ఇంత పెద్దది అయ్యిందా అని కామెంట్స్ చేస్తున్నారు.

Meena Daughter Latest Look (Source: Instagram)
మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90'sలో స్టార్ హీరోయిన్గా దక్షిణాది ఓ వెలుగు వెలిగారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా మారారు.

Meena Daughter Latest Look (Source: Instagram)
పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆమె ఆ తర్వాత కొన్ని రోజులకు రీఎంట్రీ ఇచ్చారు. అదే టైంలో తన కూతురు నైనికని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన విజయ్ 'తెరి' చిత్రంలో నైనిక బాలనటిగా తెరంగేట్రం చేసింది.

Meena Daughter Latest Look (Source: Instagram)
ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు బట్టాయి. చైల్డ్ ఆర్టిస్టుగా తన క్యూట్ క్యూట్ స్మైల్, డైలాగ్స్ తో ఆడియన్స్ ఆకట్టుకుంది. అంతేకాదు మూవీ ప్రమోషన్స్‌లోనూ తన స్పిచ్తో అదరగొట్టింది. అలా లైమ్‌లైట్‌లోకి వచ్చిన నైనిక.. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.

Meena Daughter Latest Look (Source: Instagram)
చిన్నప్పుడు వరుసగా కూతురి ఫోటోలు షేర్ చేసిన మీనా.. ఈ మధ్య అసలు కూతురిని చూపించడం లేదు. ఆమె ఫోటోలు షేర్ చేసి కూడా చాలా కాలం అవుతుంది. ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె కూతురు నైనిక క్రిస్మస్ సందర్భంగా ఫోటోలు షేర్ చేసింది.

Meena Daughter Latest Look (Source: Instagram)
ప్రస్తుతం టీనేట్ వయసుకు వచ్చిన నైనిక లుక్‌ని చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. తల్లిని మించిన అందంతో ఎంతో ముద్దుగా ఉందని, ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే సమయం వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Meena Daughter Latest Look (Source: Instagram)
దీంతో నైనిక హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంపై మీనా ఫ్యాన్స్ నెట్టింట తెగ చర్చ మొదలుపెట్టేశారు. ప్రస్తుతం మీనా కుతురి నైనిక లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.