E-Paper
Advertisement

మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!

మేడ్చల్‌లో పౌరసరఫరాల శాఖ దాడులు.. 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు!
Advertisement

Rice Price Rules: బియ్యం విక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ధరలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సహాయ పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బియ్యం అమ్మకాల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 10 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఆ ధరల ప్రకారమే బియ్యం..

శనివారం ఆయన మేడ్చల్ పట్టణంలోని పలు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో బియ్యం నిల్వలు, విక్రయాల వివరాలను పరిశీలించారు. ప్రభుత్వం మూడు రకాల బియ్యానికి సంబంధించి నిర్ణీత ధరలను ఖరారు చేసిందని, వ్యాపారులు ఆ ధరల ప్రకారమే బియ్యం విక్రయించాలని స్పష్టం చేశారు. నిర్ణీత ధరలకు విరుద్ధంగా విక్రయాలు జరిపినా, నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 100 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని, ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అధిక మొత్తంలో బియ్యం..

Advertisement

వినియోగదారులు కూడా బియ్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ అవసరాలకు సరిపడా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. అనవసర భయాందోళనలకు గురై అధిక మొత్తంలో బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి శనివారం హోల్‌సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు, సరఫరాదారులు తమ వద్ద ఉన్న బియ్యం నిల్వల వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ పౌరసరఫరాల శాఖకు సహకరించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.

Also Read: మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

Tags

Related News

మీ ఇంట్లో పాత బట్టలు ఉన్నాయా.. మల్కాజిగిరి మున్సిపాలిటీ వినూత్న ప్రయోగం!

జీఓ నం. 14 ను రద్దు చేయాలని.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్!

ఇళ్లు మంజూరైనా పనులు ప్రారంభించకపోతే రద్దే: మంత్రి పొన్నం ప్రభాకర్!

మేడ్చల్‌లో మిషన్ భగీరథ నీరు రోడ్డుపాలు.. పట్టించుకోని అధికారులు!

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అవ్వదు.. కేటీఆర్ గడ్డం పై సీఎం రేవంత్ కౌంటర్!

తెలంగాణ ఖైదీలకు.. కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్న జైళ్ల శాఖ!

రేసుగుర్రం అనుకుంటే కీలుగుర్రంగా మారిన సీఎం రేవంత్: కవిత ఎద్దేవా

Big Stories

Advertisement
×