
Alekhya Harika ( Source / Instagram )
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు, వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతోమంది బాగా పాపులారీటిని సొంతం చేసుకుంటున్నారు.. వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా మారుతున్నారు. అలాంటి వారిలో దేత్తడి హారిక ఒకరు..

Alekhya Harika ( Source / Instagram )
తెలంగాణకు చెందిన ఈమె అమ్మడు స్టడీస్ ను పూర్తి చేసి జాబ్ లో జాయిన్ అయ్యింది. ఇక అలేఖ్యకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్ కావాలని కోరిక..

Alekhya Harika ( Source / Instagram )
చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఆమె అమెజాన్ లో హైదరాబాద్‌లోని అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో ఎగ్జిక్యూటివ్‌గా చేరింది.. అలేఖ్య దాదాపుగా మూడేళ్లు అక్కడ పనిచేసింది. ఆ తర్వాత యూట్యూబ్ లో వీడియోలు చేసింది.

Alekhya Harika ( Source / Instagram )
దేత్తడి హారిక స్టార్ మా ప్రసారం అయినా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయింది.. హౌస్ లో తన అల్లరితో ఆటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ ద్వారా ఆమెకు మంచి క్రేజ్ దక్కింది..

Alekhya Harika ( Source / Instagram )
ఇక ఆ తర్వాత ఆదిత్య వర్మ, వరుడు కావలెను, శ్రీకారం, సింబా అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.. హీరో సంగీత్ శోభన్ సరసన తొలిసారి హీరోయిన్‌గానటించింది. ఆ తర్వాత యూట్యూబ్‌లో ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ..

Alekhya Harika ( Source / Instagram )
ఇక సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది హారిక. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో చీరలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. సింపుల్ గా ఉన్నా కూడా స్టైలిష్ గా కనిపించడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి...