Kris Srikkanth On Shubman Gill: 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు ( 2027 odi world cup) ఏడాది సమయం కూడా లేదు. ఈ తరుణంలోనే అన్ని జట్లు వన్డేలపై ఫోకస్ చేస్తున్నాయి. 2027 వరల్డ్ కప్ వరకు గ్యాప్ లేకుండా వన్డేలు ఆడేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. టీమిండియా కూడా విదేశాల్లో వన్డేలు ఆడుతూ దూసుకెళుతోంది. ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలనే కసితో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలోనే టీమిండియా సారథి శుభమాన్ గిల్ బ్యాటింగ్ పై మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ (Kris Srikkanth) వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాలో ఉన్న కఠినమైన పిచ్‌లను గిల్ ( Shubman Gill) తట్టుకోలేడని.. 2027 వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాఫ్ అవుతాడంటూ బాంబ్ పేల్చాడు. న్యూజిలాండ్ గడ్డపైనే సరిగ్గా ఆడలేని శుభమాన్ గిల్, సౌతాఫ్రికా గడ్డపై ఆడతాడని తాను అస్సలు అంచనాలు పెట్టుకోవడం లేదంటూ విమర్శలు చేశాడు. దీనిపై బీసీసీఐ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో గిల్ పై మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ దగ్గర పడుతున్న క్రమంలో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ బ్యాటింగ్ పై మాజీ క్రికెటర్ క్రిష్ శ్రీకాంత్ (Kris Srikkanth) కీలక వ్యాఖ్యలు చేశాడు. శుభమాన్ గిల్ ఫాట్ పిచ్ లపై రెచ్చిపోయి ఆడతాడన్నాడు. ఐపీఎల్ కోసం ప్రీపేర్ చేసిన హైవే మైదానాలు, ఇండియన్ ఫ్లాట్ పిచ్ లపై గిల్ ను తట్టుకోవడం ప్రత్యర్థికి కష్టమేనన్నాడు. కానీ, విదేశీ గడ్డలపై గిల్ భారీ ఇన్నింగ్స్ లు ఆడిన సందర్భాలు చాలా తక్కువేనని బాంబ్ పేల్చాడు.
అలాంటిది 2027 వన్డే వరల్డ్ కప్ జరిగే దక్షిణాఫ్రికా లాంటి బౌన్సీ, కఠినమైన పిచ్ లపై గిల్ ఆడతాడని అస్సలు అంచనాలు పెట్టుకోవద్దని కోరాడు. అక్కడి మైదానాలను లైట్ తీసుకుంటే, గిల్ అట్టర్ ఫ్లాఫ్ అవుతాడంటూ హాట్ కామెంట్స్ చేశాడు. కానీ ఇప్పటి నుంచే బౌన్సీ, కఠినమైన పిచ్ లపై శుభమాన్ గిల్ దృష్టి పెట్టాలని కోరాడు. అప్పుడే గిల్ ప్రదర్శన సౌతాఫ్రికాలో మెరుగుపడుతుందని సూచనలు చేశాడు. అలా కాదని ఫ్లాట్ పిచ్ లపైనే ప్రాక్టీస్ చేస్తే టీమిండియా కొంప మునుగుతుందని హెచ్చరించాడు.