BigTV English

Anupama Parameswaran: ఓ మై లిల్లీ.. ఎలా ఉండేదానివి.. ఎలా మారిపోయావ్

Anupama Parameswaran: ఓ మై లిల్లీ.. ఎలా ఉండేదానివి.. ఎలా మారిపోయావ్

Anupama Parameswaran: ప్రేమమ్ సినిమాతో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. రింగురింగుల జుట్టు.. బూరె బుగ్గలతో చిన్నదాన్ని చూడగానే తెలుగు ప్రేక్షకులు  మనసు పారేసుకున్నారు.


మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న అనుపమ.. వరుసగా సినిమాలు చేస్తూ తెలుగు హీరోయిన్ అనిపించుకుంది. అఆ, శతమానంభవతి లాంటి సినిమాల్లో పదహారణాల తెలుగు పిల్లలా కనిపించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.


విజయాపజయాలను లెక్కచేయకుండా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

అందాల ఆరబోత చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో నిలిచింది.

ముద్దుగా బొద్దుగా ఉండే అనుపమ సైతం రూటు మార్చింది. బక్కచిక్కి జీరో సైజ్ కు వచ్చి అందాల ఆరబోతకు తెరలేపింది.

ఇక సన్నబడ్డాక అమ్మడి అందాల ఆరబోత మాములుగా లేదు. అనుపమనేనా అనే అనుమానం కూడా కొంతమందికి వచ్చింది అంటే అతిశయోక్తి కాదు.

ఈ ఏడాది టిల్లు స్క్వేర్ లో అమ్మడి అందాల ఆరబోత, లిప్ కిస్ లు చూసి కుర్రాళ్ళు షాక్ అయ్యారు. ఆ సినిమా అనుపమకు మంచి హిట్ ను అందించింది.

నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అదరగొడుతున్న అనుపమ.. తాజగా బ్లాక్ శారీలో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది.

బ్లాక్ కలర్ చీరపై స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా కొప్పు పెట్టి.. దాని చుట్టూ మల్లెలు చుట్టి.. ఇంకా తనకు అందాన్ని తీసుకొచ్చే ముత్యాల హారాన్ని ధరించి కనిపించింది.

తెల్లని దేహంపై నల్లని చీరలో అమ్మడు పౌర్ణమి రోజు వెలిగే కలువలా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే అభిమానులు మాత్రం.. అనుపమ చబ్బీ లుక్ ను మిస్ అవుతున్నారు. ఇలా బక్కచిక్కిన అనుపమ నచ్చలేదని.. అప్పుడు ఎంతబావుండేది .. ఇప్పుడు ఇలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనుపమ చేతిలో.. పరదా, బిసోన్ చిత్రాల్లో నటిస్తుంది.

Related News

Sreemukhi : రెండు జడలతో రాములమ్మ ఫోటోలు అదుర్స్..క్యూట్ గా ఉంది కదా..

Ariana Glory : ట్రెడిషినల్ లుక్ లో అరియానా.. పోరి మస్తు ఉంది మావా..

Niharika Konidela: చీర కట్టులో మరింత అందంగా ముస్తాబైన మెగా డాటర్!

Anchor Manjusha: యాంకర్‌ మంజుష హాట్‌ లుక్స్‌.. ఘాటు అందాలతో కుర్రకారును రెచ్చగొడుతున్న తెలుగమ్మాయి..

Shriya Saran: శ్రియాకి ఇంత పెద్ద కూతురుందా.. అయినా ఏంమారలేదుగా?

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ లుక్స్‌.. అదిరిపోయే ఫోజులతో మతిపోగొడుతున్న అఖండ బ్యూటీ

Big Stories

×