
Krithi Shetty (Image Credit: Instagram)
కృతి శెట్టి కన్నడ బ్యూటీగా తనకంటూ పేరు సొంతం చేసుకున్న ఈమె.. తొలిసారి తెలుగులో బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

Krithi Shetty (Image Credit: Instagram)
అటు దర్శకుడిగా బుచ్చిబాబుకి, హీరోగా వైష్ణవ్ తేజ్ కి, హీరోయిన్ గా కృతి శెట్టి ముగ్గురికి ఇది తొలి సినిమానే అయినా తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Krithi Shetty (Image Credit: Instagram)
ఈ సినిమా తర్వాత కృతి శెట్టి బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టింది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది.

Krithi Shetty (Image Credit: Instagram)
ప్రస్తుతం అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేయనున్నారు.

Krithi Shetty (Image Credit: Instagram)
ఇక తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా అవకాశాలు అందుకుంటున్న ఈమె మరొకవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Krithi Shetty (Image Credit: Instagram)
తాజాగా గ్రీన్ కలర్ చీర కట్టుకొని దానికి కాంబినేషన్లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందాలతో ఆకట్టుకుంది. కొంటెగా ఫోజులిచ్చిన ఈమె మరికొన్ని ఫోటోలలో ఓరచూపుతో గుండెల్లో గుబులు పుట్టించింది.