E-Paper
Advertisement

బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. ఇకపై అలా చేస్తే జైలుకే..?

బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. ఇకపై అలా చేస్తే జైలుకే..?
Advertisement

Rice Inspections: బియ్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వినియోగదారులను మోసం చేస్తూ తూకాల్లో కోత విధించడం, బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడటం, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలను ముమ్మరం చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా రంగంలోకి దిగి రైస్‌మిల్లులు, బియ్యం దుకాణాలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 2,686 రైస్ మిల్లులు, హోల్ సేల్ డీలర్లు, రిటైల్ షాపుల్లో తనిఖీ చేసి 370 కేసులు నమోదు చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది.

తూకాల్లో కోతకు చెక్‌!

కృత్రిమ కొరత, ధరల పెంపునకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులకు తూకాల్లో మోసం జరగకుండా చూడటంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కిలో బియ్యం కొనుగోలు చేసినప్పుడు తక్కువ పరిమాణం ఇవ్వడం, తూకం యంత్రాల్లో లోపాలు ఉంచడం, తూనికలు, కొలతల నిబంధనలను ఉల్లంఘించడం వంటి వ్యవహారాలపై నిఘా పెంచారు. దుకాణాల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాల పనితీరు, వాటి ధ్రువీకరణ, ముద్రలు, తూకాల్లో కచ్చితత్వాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.కొంతమంది వ్యాపారులు వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తూకాల్లో కోత విధిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బియ్యం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి సరైన పరిమాణం అందేలా చూడటమే లక్ష్యంగా లీగల్‌ మెట్రాలజీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నిల్వలపైనా నిఘా

Advertisement

రైస్‌మిల్లుల్లో బియ్యం నిల్వలు, వ్యాపార సంస్థల్లో సరకు లభ్యత, సంబంధిత రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమతులకు మించి నిల్వలు ఉంచడం, నిల్వలకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, అక్రమంగా బియ్యాన్ని దాచిపెట్టడం వంటి అంశాలపై దృష్టి సారించారు. బియ్యం నిల్వల విషయంలో అక్రమాలకు పాల్పడుతూ మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వంచర్యలు చేపట్టింది.బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసి వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇలాంటి అక్రమార్కులపై పీడీ యాక్టు ప్రయోగించే స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: రూ. 299 ప్లాన్ మళ్లీ తెచ్చిన ఎయిర్‌టెల్.. అయినా యూజర్లకు నిరాశే.. కారణం ఏంటో తెలుసా?

2,686 చోట్ల తనిఖీలు.. 370 కేసులు

Advertisement

మార్కెట్లో ధరల పెరుగుదల నుంచి వినియోగదారులను రక్షించడానికి, ప్రజలు ఎక్కువగా వాడే బియ్యం రకాలపై గరిష్ట రిటైల్ ధరలను అధికారులు అమలు చేశారు. బీపీటీ/కేఎన్ఎం రకం బియ్యం ధరను కిలోకు ₹66 గా నిర్ణయించారు. ఆర్ఎన్ఆర్/తెలంగాణ సోనా బియ్యం కిలో ₹74 , హెచ్ఎంటీ/జేఎస్ఆర్ రకం బియ్యం కిలో ₹79కి మించకూడదని స్పష్టం చేశారు. మార్కెట్లో పారదర్శకత కోసం, మిల్లర్లు, వ్యాపారులు ప్రతి 26 కిలోల బియ్యం బస్తాపై ఈ నిర్ణయించిన ధరలనుతప్పనిసరిగా ముద్రించాలని ఆదేశించారు.వినియోగదారులను మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరికలు జారీచేశారు. టాస్క్ ఫోర్స్ బృందాలు రైస్ మిల్లులు, హోల్ సేల్ డీలర్లు, రిటైల్ షాపుల్లో మొత్తం 1,141 ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని వారిపై ఈ తనిఖీల ద్వారా 55 కేసులు, 35 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు, తూనికలు-కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 1,545 తనిఖీలు నిర్వహించి, ప్రజలను మోసం చేయాలని చూసిన వారిపై 280 కేసులు నమోదు చేశారు.

నిరంతర నిఘా..

ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీలతో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కొంతమేర నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులుపేర్కొంటున్నారు. అయితే తనిఖీలు ఒకటి రెండు రోజులకు పరిమితం కాకుండా నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. పట్టణాలు, నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని రైస్‌మిల్లులు, బియ్యం దుకాణాలపైనా నిఘా పెంచేందుకు సిద్ధమైంది.వినియోగదారులకు నాణ్యమైన బియ్యం, సరైన తూకం అందించడంతోపాటు బియ్యం వ్యాపారంలో పారదర్శకత తీసుకురావడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. నిబంధనలు పాటిస్తూ వ్యాపారం నిర్వహించే వారికి ఇబ్బందులు లేకుండా, అక్రమాలకు పాల్పడే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలు, నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలను మరింత ముమ్మరం చేయడం ద్వారా బియ్యం వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.

అక్రమంగా బియ్యాన్ని నిల్వచేస్తే పీడీ యాక్ట్: కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

రేషన్ బియ్యాన్ని పదే పదే అక్రమంగా నిల్వ చేసే వారిపై, అలాగే మార్కెట్ ధరలను పెంచే వారిపై పీడీ యాక్టునే నమోదుచేస్తాం. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పదే పదే ఇలాంటి తప్పులు చేసే ఈ నేరస్థులు నిత్యావసర సరుకుల చట్టం, బీఎన్ఎస్ కింద కఠిన విచారణ, జైలు శిక్షను ఎదుర్కొంటారు. కృత్రిమ కొరత, ధరల పెంపునకు అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టాం. బస్తాలో 25 కిలోల బియ్యం మాత్రమే ఉంచి, పైన 26 కిలోల లేబుల్ అతికించి తూకాల్లో మోసం చేస్తున్న వ్యాపారులను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. అసలు ధరలు కనిపించకుండా వాటిపై ఎక్కువ ధరల స్టిక్కర్లు అంటించడం, రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, జీఎస్టీ లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తూ ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశాం. తనిఖీలు నిరంతర ప్రక్రియ.మార్కెట్లలో అక్రమాలకు పాల్పడే వారికి తగిన శిక్ష పడేలా చూస్తూ, సాధారణ వినియోగదారులను రక్షించడానికి పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం తన నిఘాను కొనసాగిస్తుంది.

Also Read: ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై ఉద్రిక్తత.. మాజీ మంత్రి రోజా ధర్నా..!

Tags

Related News

‘సర్’ పై వ్యూహాత్మక మౌనం ! బీఆర్‌ఎస్ సైలెంట్ మోడ్‌..! ఆ మౌనం వెనుక మతలబేమిటీ…? పైగా ప్రతిపక్షంపైనే విమర్శల దాడి!

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ఫెయిలైందిక్కడే! ఇందిరమ్మ ఇండ్లు ఓకే.. ‘టవర్స్‌’ పై జిల్లాల్లో అనాసక్తి! లబ్దిదారుడి వాటే అసలు సమస్య?

మీ ఫ్యాషన్.. హైదరాబాద్ భవిష్యత్తును బూడిద చేస్తోందా?

ఎంపీ, ఎమ్మెల్యే సీట్లపై బిగ్ డిబేట్.. 70 ఏళ్లుగా ఒకే వర్గానికి రిజర్వేషన్.. రొటేషన్ ఎందుకు లేదు?

నో రేషన్.. నో పెన్షన్? .. ఓటర్ ఐడీ లేకపోతే ప్రభుత్వ సాయం బంద్ కానుందా!

కాళేశ్వరం క్లైమాక్స్.. అసెంబ్లీలో కేసీఆర్ అడుగుపెడతారా? బీఆర్‌ఎస్ ప్లాన్ బి ఏంటి?

బీజేపీని గెలిపించడం కచ్చితంగా ప్రజల తప్పేనట! భావోద్వేగాలకు లొంగితే ఇలాంటి సీఎంలే వస్తారన్న పీకే! బీహార్‌ సీఎంపై ట్రోలింగ్స్‌..!

Big Stories

Advertisement
×