E-Paper
Advertisement

ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!

ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!
Advertisement

Russian Army: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఐదేళ్లుగా ఎడతెగకుండా సాగుతున్న మారణహోమం. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు మట్టికరిచారు. శవాల దిబ్బలుగా సరిహద్దులుమారిపోయాయి దీంతో …. రష్యాకు ఇప్పుడు సైనికులు కరువయ్యారు. యుద్ధ క్షేత్రంలో తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచే ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’ కోసంరష్యా ప్రభుత్వం ఒక వ్యూహం పన్నింది. విదేశీయులు ఎవరైనా సరే.. రష్యా ఆర్మీతో ఏడాది పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే, వారికి భారీ జీతంతో పాటు రష్యా పౌరసత్వం ఇస్తామంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ, ఈ చట్టాన్ని రష్యా ప్రకటించిందో లేదో.. మన దేశంలోని కొందరు నకిలీ ట్రావెల్ ఏజెంట్లు దీనిని ఒక కాసుల కురిపించే వ్యాపారంగా మార్చేసుకున్నారు. అదే మన కళ్లెదుట కనిపిస్తున్న ‘కూలి సైనిక్ 259’ అనే నంబర్ వెనుక ఉంది కేవలం రికార్డులు కాదు.. ఏజెంట్ల చేతిలో మోసపోయి, రష్యా బంకర్లలో చావుతో పోరాడుతున్న 259 మంది భారతీయ యువకుల ఆర్తనాదాలు!

వంట ఉద్యోగం అని చెప్పి.. చేతికి తుపాకీ

Advertisement

ఈ మోసం ఎలా జరిగిందో జరుగుతుందో తెలుసా? ‘రష్యాలో ఆర్మీ క్యాంపుల్లో వంటవాళ్లుగా, క్లీనర్లుగా, ఆఫీస్ హెల్పర్లుగా సులువైన ఉద్యోగాలు ఉన్నాయి. నెలకు 2 నుండి 3 లక్షల జీతం వస్తుంది’ అంటూ యూట్యూబ్, సోషల్ మీడియాలో నకిలీ ఏజెంట్లు రంగుల ప్రపంచాన్ని చూపిస్తారు. నిరుద్యోగంతో, కుటుంబ కష్టాలతో సతమతమవుతున్న అమాయక యువకులు ఈ ట్రాప్‌లో చిక్కుకుంటున్నారు. ఏజెంట్లు వారికి వర్క్ వీసా ఇవ్వరు, కేవలం విజిటింగ్ వీసాలపై రష్యాకు విమానం ఎక్కిస్తారు. అసలు ఉచ్చు రష్యా గడ్డపై అడుగుపెట్టాక మొదలవుతుంది. అక్కడకు వెళ్లిన యువకులను ఏజెంట్లు ఒక గదిలోకి తీసుకెళ్తారు. రష్యన్ భాషలో ఉన్న కొన్ని కాంట్రాక్ట్ పత్రాలను వారి ముందు పెడతారు. ఆ భాష మన వాళ్లకు అస్సలు అర్థం కాదు. ‘ఇది కేవలం సెక్యూరిటీ బాండ్ మాత్రమే’ అని నమ్మించి సంతకాలు చేయించుకుంటారు. ఆ సంతకం పడిందో.. వారు చట్టబద్ధంగా రష్యా సైనికులుగా మారిపోయినట్లే!

రష్యా సైనిక చట్టాల ప్రకారం..

Advertisement

ఒక్కసారి సంతకం చేశాక వెనక్కి తగ్గే దారే లేదు. రష్యా సైనిక చట్టాల ప్రకారం.. కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాక యుద్ధంలో పాల్గొననని నిరాకరిస్తే, లేదా యుద్ధ రంగం నుండి పారిపోవాలని చూస్తే అది దేశద్రోహం కిందకు వస్తుంది. దానికి శిక్ష ఏంటో తెలుసా? కఠినమైన జైలు శిక్ష లేదా అక్కడికక్కడే మరణశిక్ష! దీంతో చావుకైనా సిద్ధపడాలి లేదా తుపాకీ పట్టుకుని యుద్ధ రంగంలోకైనా దూకాలి. కేవలం 15 రోజుల నామమాత్రపు శిక్షణ ఇచ్చి, మన యువకులను ఉక్రెయిన్ బాంబుల వర్షం కురిపించే అత్యంత ప్రమాదకరమైన ఫ్రంట్‌లైన్‌ లోకి నెట్టేస్తున్నారు.

రష్యా ఆర్మీలో 259 మంది భారతీయులు..

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక లెక్కల ప్రకారం.. ఈ నకిలీ నెట్‌వర్క్ ద్వారా ఇప్పటివరకు 259 మంది భారతీయులు రష్యా ఆర్మీలో బలవంతంగా చేర్చబడ్డారు. ఇందులో మన తెలుగు రాష్ట్రాల యువకులు కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం రష్యాపై తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి స్థాయిలోనే చర్చలు జరిపి, ఇప్పటివరకు 139 మందిని రష్యా ఆర్మీ కాంట్రాక్ట్ నుండి విడిపించి సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు.దురదృష్టవశాత్తూ, ఈ దౌత్య చర్చలు సఫలమయ్యేలోపే ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, బాంబుల దాడిలో 51 మంది భారతీయ యువకులు ప్రాణాలు కోల్పోయారు. నిరుద్యోగం తీరి ఇంటికి పైసలు పంపుతాడనుకున్న కొడుకులు శవాలై రావడంతో ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా 69 మంది భారతీయులు రష్యా బంకర్లలో చిక్కుకుని, తాము ఎప్పుడు చనిపోతామో తెలియని భయానక స్థితిలో బతుకుతున్నారు.

భారత పౌరసత్వ చట్టాల ప్రకారం..

వాస్తవానికి, భారత పౌరసత్వ చట్టాల ప్రకారం.. ఏ ఇతర దేశం పైన కూడా భారతీయులు వ్యక్తిగతంగా వెళ్లి యుద్ధం చేయకూడదు. అది చట్టవిరుద్ధం. కానీ ఇక్కడ మన యువకులు దేశభక్తితోనో, యుద్ధం చేయాలనే పిచ్చితోనో వెళ్లలేదు. కేవలం పొట్టకూటి కోసం వెళ్ళి, ఏజెంట్ల మోసపూరిత ట్రాప్‌లో చిక్కుకుని ఆగమైపోతున్నారు. ఈ దారుణమైన హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్‌పై కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు సైతం తీవ్రంగా స్పందించాయి. దేశవ్యాప్తంగా విదేశాలకు యువతను అక్రమంగా పంపుతున్న నకిలీ వీసా ఏజెంట్లపై సీబీఐ దాడులు నిర్వహించి, పలువురు ఏజెంట్లను అరెస్ట్ చేసింది. మానవ అక్రమ రవాణా కోణంలో విచారణ జరుపుతోంది. మిగిలిన 69 మందిని కూడా త్వరితగతిన విడుదల చేయాలని రష్యా రక్షణ శాఖతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.రష్యాలో ఎలాంటి ఆర్మీ సహాయక ఉద్యోగాలు లేవని, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మి టూరిస్ట్ వీసాలపై వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని విదేశాంగ శాఖ అధికారికంగా హెచ్చరిస్తోంది.

ఉద్యోగం కాదు.. మరణ ఉచ్చు

డబ్బు సంపాదన ముఖ్యం కావచ్చు.. కానీ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. విదేశీ ఉద్యోగాల పేరిట వచ్చే ప్రకటనల వెనుక ఉన్న నిజానిజాలను సరిచూసుకోకపోతే, అమాయక యువకులు ‘కూలి సైనికులు’గా మారి బలిపశువులయ్యే ప్రమాదం ఉంది. ఈ ‘కూలి సైనిక్ 259’ స్టోరీ.. మోసపోతున్న ప్రతి నిరుద్యోగి కళ్లు తెరిపించే ఒక హెచ్చరిక!

Also Read: అవకాశం ఉంటే రే*ప్ కేసు కూడా పెట్టేవారేమో! నల్లపాడు పోలీసులపై అంబటి షాకింగ్ కామెంట్స్

Tags

Related News

మోదీ పాలనపై సోనియా ఫైర్.. 1975 నాటి ఎమర్జెన్సీపై క్లారిటీ.. కేంద్రమంత్రులు స్ట్రాంగ్ కౌంటర్!

నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్న భార్య.. అయినా భరణం కావాలని భర్తపై కేసు.. కోర్టు తీర్పు ఇదే

ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్.. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని వారికి మరో ఛాన్స్!

సీజేఐ సూర్యకాంత్‌పై వివాదాస్పద పోస్ట్.. కేరళ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు!

‘పేదలు కాలుష్యం చేయరు.. ధనికులే అసలు కారణం’.. ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం!

సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!

26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!

Big Stories

Advertisement
×