E-Paper
Advertisement

40 కి.మీ. దూరంలోని రెస్టారెంట్ నుంచీ ఫుడ్ ఆర్డర్.. జొమాటో కొత్త ఫీచర్, 7 నగరాల్లో ప్రారంభం!

40 కి.మీ. దూరంలోని రెస్టారెంట్ నుంచీ ఫుడ్ ఆర్డర్.. జొమాటో కొత్త ఫీచర్, 7 నగరాల్లో ప్రారంభం!
Advertisement

Zomato Limitless Delivery: సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్‌లలో మనకు నచ్చిన రెస్టారెంట్ కనిపించినా.. అది చాలా దూరంలో ఉందనే కారణంతో ఆర్డర్ చేయలేకపోవడం చాలామందికి సమస్య. ఈ ఇబ్బందిని తగ్గించేందుకు జొమాటో కొత్తగా ‘లిమిట్‌లెస్ డెలివరీ’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకే నగరంలో 40 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ప్రస్తుతం ఏడు నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ మందికి నచ్చిన చోటు నుంచి ఆహారం తెప్పించుకునే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం.

ఏడు నగరాల్లో సేవలు..

జొమాటో తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, ముంబై, కోల్‌కతా, పుణె, హైదరాబాద్ నగరాల్లో లిమిట్‌లెస్ డెలివరీ అందుబాటులో ఉంది. అయితే ప్రతి రెస్టారెంట్‌ నుంచి ఈ సేవ ఉండదు. ఇందులో భాగమైన రెస్టారెంట్ల నుంచే ఆర్డర్ చేయగలరు. ఒకే నగర పరిధిలో దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య కూడా ఆర్డర్ పెట్టుకునే వీలుంటుంది. ఉదా: నోయిడాలోని సెక్టార్ 18 నుంచి సెక్టార్ 137లో ఉన్న రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్ చేయడం సాధ్యమవుతుంది. డెలివరీ పరిధి దాటిపోయిందని వదిలేసిన రెస్టారెంట్లు ఇప్పుడు కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!

యాప్‌లో ఎలా వాడాలి?

ఈ ఫీచర్ ఉపయోగించడం సులభమే. జొమాటో యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్‌లోని ఎక్స్‌ప్లోర్ మోర్ విభాగంలో లిమిట్‌లెస్ డెలివరీ సెక్షన్‌ను చూడాలి. అక్కడ ఈ సేవ అందించే రెస్టారెంట్ల జాబితా కనిపిస్తుంది. మీకు కావాల్సిన రెస్టారెంట్ పేరు నేరుగా సెర్చ్ చేసినా సరిపోతుంది. ఆ రెస్టారెంట్ ఈ ఫీచర్‌లో ఉంటే దాని మెనూ కనిపిస్తుంది. తర్వాత వంటకాలు ఎంచుకుని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే డెలివరీ సమయం, అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు.

హోస్ట్ మోడ్‌తో ధరలు కనిపించవు..

Advertisement

లిమిట్‌లెస్ డెలివరీతో పాటు జొమాటో హోస్ట్ మోడ్‌ను కూడా తీసుకొచ్చింది. పార్టీ లేదా కుటుంబ వేడుక ఉన్నప్పుడు ఒకే ఫోన్‌లో అందరూ తమకు నచ్చిన వంటకాలు ఎంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. హోస్ట్ మోడ్ ఆన్ చేస్తే మెనూ, కార్ట్‌లోని ధరలు కనిపించవు. దీంతో ఫోన్‌ను అతిథులకు ఇచ్చి వారి ఎంపికలు చేయించవచ్చు. అందరూ ఎంచుకున్న తర్వాత హోస్ట్ మోడ్ ఆఫ్ చేసి, పాస్‌కోడ్ లేదా బయోమెట్రిక్‌తో అన్‌లాక్ చేసి బిల్లు చూసి చెల్లించాలి. ఖర్చు గురించి ఆలోచించకుండా అతిథులు తమకు నచ్చినవి ఎంచుకునేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

మరిన్ని నగరాలకు వస్తుందా?

ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు ఏడు నగరాలకే పరిమితమయ్యాయి. మరిన్ని నగరాలకు ఎప్పుడు విస్తరిస్తారనే విషయంపై జొమాటో స్పష్టత ఇవ్వలేదు. దూరంలోని రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసే అవకాశం, గ్రూప్ ఆర్డర్లలో ధరలు హైడ్ సదుపాయం వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండొచ్చు.

Also Read: బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!

Tags

Related News

అద్భుతమైన ఫీచర్లతో..తోషిబా 4K టీవీ మోడల్స్ లాంచ్!

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ బంపర్ ఆఫర్.. ఇక సీక్రెట్‌గా మెసేజ్‌లు చదవొచ్చు, బ్లూ టిక్స్ పడవు!

రూ. 299 ప్లాన్ మళ్లీ తెచ్చిన ఎయిర్‌టెల్.. అయినా యూజర్లకు నిరాశే.. కారణం ఏంటో తెలుసా?

తక్కువ ధరలో బెస్ట్ డిష్ వాషర్ కావాలా ? వీటికంటే బెస్ట్ ఉండవు!

బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!

హార్డ్ వాటర్‌లోనూ బట్టలు మెరిపించే.. టాప్ 5 IFB ఫ్రంట్ లోడ్ మోడల్స్!

మెటా మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. ఇక మనిషితో మాట్లాడినట్టే AIతో మాట్లాడొచ్చు!

Big Stories

Advertisement
×