కృతి కర్బంద తీన్మార్ సినిమాలో నటించి సూపర్ క్రెజ్ సంపాదించుకుంది. కానీ ఈ అమ్మడుకి ఆ సినిమా తర్వాత ఆఫర్లు వచ్చాయి కానీ అంతగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి.
తీన్మార్ సినిమా తర్వాత రామ్ సరసన ఒంగోలు గిత్త మూవీలో నటించింది. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా బ్రూస్ లీలో సోదరిగా నటించింది.
బోణీ అనే చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో బాలీవుడ్, కన్నడ, తమిళంలోనూ అదృష్టం పరిక్షించుకుంది.
బాలీవుడ్ హీరో పుల్కత్ సామ్రాట్ తో కొన్ని ఏళ్ల పాటు లవ్ చేసుకుని ఇటీవల వివాహం చేసుకుంది.
మ్యారేజ్ తర్వాత తన కెరీర్ మొదలు పెట్టింది ఈ భామ. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజగా కొన్ని పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ భామ.