Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో గ్రాండ్ గా మొదలైన విషయం తెల్సిందే. 14 మంది కంటెస్టెంట్స్.. 7 జోడీలుగా హౌస్ లోపలికి వెళ్లారు. ఇక మొదటి రోజు నుంచే ఈ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలను నామినేషన్స్ మరింత హీట్ పెంచేలా చేసాయి. నామినేషన్స్ లో సిల్లీ రీజన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు.
నిన్న సగం మంది నామినేట్ చేశారు. ఇక ఈరోజు సగం మంది నామినేషన్ కు రెడీ అయ్యారు. ఈ కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరు ఒక్కో గేమ్ ఆడుతున్నారు. నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడు. ఇంకోపక్క సోనియా.. చిన్నదానికి, పెద్దదానికి అగ్రెసివ్ అవుతూ ఓవర్ యాక్షన్ చేస్తుంది.
కిర్రాక్ సీతా.. ఆ ఒక్క గుడ్డును వండుకోనివ్వలేదని అరుస్తుంది. ఇక అసలు మిగతావారు ఎందుకు వెళ్లారో.. ఎందుకు అరుస్తున్నారో తెలియకుండా పోయింది. ఈరోజు రిలీజ్ అయినా ప్రోమోల్లో అభయ్, పృథ్వీ ఫైర్ అయిన విధానం ఆకట్టుకుంటుంది. అసలు హౌస్ లో ఉండేందుకు మణికంఠ పనికిరాడని నిక్కచ్చిగా చెప్పుకొచ్చాడు. దానికి మణికంఠ మళ్లీ తన లైఫ్ గురించి చెప్పుకొచ్చి.. అదే పాత పాటను పాడడం మొదలుపెట్టాడు.
ఇక దీనికి సమాధానంగా అభయ్.. లైఫ్ లో అందరికి కష్టాలు ఉంటాయని, అందరూ కష్టాలను ఎదుర్కొనే ఇక్కడ వరకు వచ్చామని, ప్రతిసారి సింపతీ గేమ్ ప్లే చేయొద్దని ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా హౌస్ లో ఎవరు ఏం చేసినా నేను చూస్తా.. అది నా పాయింట్ కాకపోయినా నేను మాట్లాడతాను.. ఎవడు ఫేక్ గా ఉన్నాడు.. ఎవడు మంచిగా ఉన్నాడు.. ఎవడు ఒరిజినల్ అనేది అడియన్స్ చూసుకుంటారు.. మరో నాలుగురోజుల్లో నేను కూడా వెళ్తానేమో.. ఇక్కడ పాయింట్ అది కాదు. సింపతీ గేమ్ ఆడకు అని ఫైర్ అయ్యాడు.
ఇక సోనియా మాటల యుద్ధం ఆగింది లేదు. ఇంకోపక్క విష్ణు ప్రియ ఎంజాయ్ చేయడానికి వచ్చావ్ అన్న సోనియా మాటలకు హర్ట్ అయ్యిఆమె కూడా ఫైర్ అయ్యింది. ఇక బేబక్క మీద అందరు కావాలనే కట్టకట్టుకుని నామినేషన్ చేసినట్లు కనిపిస్తుంది. మొత్తానికి ఈసారి ఎక్కువ ఓట్లు బేబక్క, నాగ మణికంఠకే పడ్డాయి. మరి ఈ వారం.. వీరిద్దరిలో ఎవరు బయటకు వెళ్తారు అనేది చూడాలి.