Bigg Boss 9 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం ఏడవ వారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు ఈ వారం కెప్టెన్సీ పదవిని దక్కించుకోవడానికి అటు కంటెస్టెంట్లు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏడవ వారంలో ఇమ్మానుయేల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. మొత్తానికైతే రెండవసారి ఇమ్మానుయేల్ కెప్టెన్సీ టాస్క్ లో గెలిచి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడంతో ఆయనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సరైన ఆట ఆడుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇమ్మానుయేల్ మళ్ళీ కెప్టెన్ అవడం వెనుక ఉన్న అసలు విషయం తెలిసి.. అటు బిగ్ బాస్ లవర్స్ కూడా పలు రకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ:Janhvi kapoor: సినిమాలలోకి కూతుర్ని పంపించడానికి శ్రీదేవి అంత పని చేసిందా?