Womens World Cup 2025 Semis: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ సెమీ ఫైనల్ దశకు వచ్చేసింది. అక్టోబర్ 29వ తేదీ నుంచి సెమీఫైనల్ బరి ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా అలాగే టీమిండియా నాలుగు జట్లు కూడా క్వాలిఫై అయి, సెమీ ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నాయి.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సెమీఫైనల్ షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. పాయింట్ల పట్టిక ప్రకారం మొదటి స్థానంలో ఆస్ట్రేలియా 11 పాయింట్లతో నిలిచింది. పది పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ 9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఐసీసీ రూల్స్ ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీమ్ వర్సెస్ నాలుగో స్థానంలో ఉన్న టీమ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. అలాగే రెండో స్థానంలో ఉన్న టీమ్ వర్సెస్ మూడో స్థానంలో ఉన్న టీమ్ మధ్య రెండో సెమీ ఫైనల్ నిర్వహిస్తారు.
అంటే ప్రస్తుతం ఉన్న పాయింట్ల పట్టిక ప్రకారం ఆస్ట్రేలియా వర్సెస్ టీం ఇండియా మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. రేపు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య లీగ్ దశలో చివరి మ్యాచ్ ఉంది. అందులో ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే, పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్తుంది. అలా జరిగితే టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి సెమీ ఫైనల్ ఉంటుంది. దీంతో ఆటోమేటిక్ గా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ నిర్వహిస్తారు. రేపటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే ముందుగా చెప్పినట్లు ఇండియాతో తలపడుతుంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్ అక్టోబర్ 29వ తేదీన గౌహతి వేదికగా నిర్వహించనున్నారు. అలాగే రెండో సెమీ ఫైనల్ నావి ముంబై డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో అక్టోబర్ 30వ తేదీన జరుగుతుంది. ఈ రెండు సెమీ ఫైనల్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. హాట్ స్టార్ లో మ్యాచ్ లు తిలకించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు వస్తున్నాయి. ఫైనల్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. పాకిస్తాన్ ఫైనల్ కు వస్తుందేమో అని అంచనా వేసి, వేదికను ముందుగానే ఫిక్స్ చేయలేదు ఐసీసీ. ఇప్పుడు పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది కాబట్టి కచ్చితంగా ఇండియాలో అహ్మదాబాద్ లేదా ముంబై వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
2025 Women's Worldcup Semifinalists:
🇦🇺🇿🇦🏴🇮🇳#WomensWorldCup2025 pic.twitter.com/0lDGvKnX3S
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 23, 2025