Worst records Created By Pakistan Team After Test Series Defeat Vs Bangladesh: పరువు పోతే పోయింది.. చెత్త రికార్డులు కూడా ఏంట్రా బాబూ.. అని పాకిస్తాన్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ తో ఓటమితో తల ఎత్తుకోలేక సతమతమవుతుంటే, తగుదునమ్మా అంటూ చెత్త రికార్డులు రావడంతో పాక్ క్రికెట్ బోర్డు ముఖం చాటేసింది. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు పాక్ ఆటగాళ్లు విలవిల్లాడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటవంటే..
సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ లు ఆడే, అన్ని జట్ల చేతిలో ఓడిన రెండో జట్టుగా పాకిస్తాన్ చరిత్రకెక్కింది. అందరికీ ఒక డౌటు వస్తుంది. మరి జింబాబ్వే చేతిలో కూడా పాకిస్తాన్ ఓడిపోయిందా? అని. నిజమేనండీ.. 1998-99లో పాకిస్తాన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో జింబాబ్వే చేతిలో కూడా ఓడి, నాడు ఇలాంటి అపఖ్యాతిని మూటగట్టుకుంది.
అయితే, ఈ చెత్త రికార్డు పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్ పేరిట కూడా ఉండటం విశేషం. స్వదేశంలో విజయం చూసి పాకిస్తాన్ కి చాలా కాలమైంది. ఇప్పటివరకు పది టెస్టులు ఆడినా, ఒక్కటీ గెలవలేదు. 6 టెస్టుల్లో ఓటమి పాలైతే, 4 టెస్టులను డ్రా చేయగలిగింది. ఈ శతాబ్దంలో పది టెస్టుల్లో విజయం సాధించని మూడో జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. అలా జింబాబ్వే, బంగ్లాదేశ్ సరసన చేరింది.
బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ కోల్పోవడం పాకిస్తాన్ కి ఇదే తొలిసారి. 2022-23లో పాక్ గడ్డపై ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో కూడా పాకిస్తాన్ ఇలాగే 0-3 తేడాతో పరాజయం పాలైంది.
ఇవన్నీ పాక్ చెత్త రికార్డులైతే, ఇక బంగ్లాదేశ్ పరంగా చూస్తే ఘనమైన రికార్డులు వారి సొంతమయ్యాయి.
Also Read: అప్పుడు అవహేళనలు.. ఇప్పుడు అభినందనలు: దీప్తి తల్లిదండ్రులు
పాకిస్థాన్ టెస్టుల్లో 185 పరుగుల లక్ష్యాన్ని చేధించిన మూడో జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంక (220), ఇంగ్లండ్ (208), బంగ్లాదేశ్ (185), ఇంగ్లండ్ (176) టాప్-4లో ఉన్నాయి.
బంగ్లాదేశ్‌కు విదేశాల్లో ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. 2009లో వెస్టిండీస్‌పై 2-0తో, జింబాబ్వేపై 1-0తో టెస్టు సిరీస్‌లను గెలిచింది.
మొత్తానికి ప్రత్యర్థుల గడ్డపై బంగ్లాదేశ్ కు ఇది ఎనిమిదో టెస్టు మ్యాచ్ విజయంగా చెప్పాలి. సెప్టెంబరు 19 నుంచి భారత్ వస్తున్న బంగ్లాదేశ్ మరిక్కడ రికార్డులు నెలకొల్పుతుందా? లేక రిక్త హస్తాలతో తిరిగి వెళుతుందా? అనేది వేచి చూడాల్సిందే.