Bigg Boss :బిగ్ బాస్.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన రియాలిటీ షోలలో ఒకటిగా పేరు సొంతం చేసుకుంది. ఇంగ్లీషులో ‘బిగ్ బ్రదర్’ పేరిట ప్రారంభమైన ఈ షో క్రమంగా బాలీవుడ్ కి పాకింది. అక్కడే బిగ్ బాస్ (Bigg Boss) అంటూ మొదలైన ఈ షో క్రమంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్రమంగా ఒక్కో భాషలో కూడా ఇప్పుడు ఈ షో నడుస్తున్న విషయం తెలిసిందే. అలా కన్నడలో ఇప్పటికే 12వ సీజన్ మొదలవగా.. అటు తమిళ్లో 9వ సీజన్ మొదలైంది. ఇటు హిందీలో 19వ సీజన్ ప్రారంభం అవ్వగా తెలుగులో తొమ్మిదవ సీజన్ మొదలైంది. ఇక అలా ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క భాషలో కూడా ఈ రియాలిటీ షో ప్రసారమవుతోంది.
ప్రతి భాషకు సంబంధించిన ఒక్కో సూపర్ స్టార్ ఈ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ షోలో సెలబ్రిటీలు హోస్ట్ గా చేస్తున్నారు అంటే.. వారికి ఎంత ప్రయారిటీ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అలాంటి ఈ బిగ్ బాస్ షోలోకి ఒక హోస్ట్ తప్ప తాగి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో సెన్స్ ఉండక్కర్లేదా అంటూ ఆ హోస్ట్ పై నెటిజన్స్, బిగ్ బాస్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హోస్ట్ ఎవరు ? ఏ భాషకు చెందినవారు?. అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) .. ప్రస్తుతం హిందీలో 19వ సీజన్ కొనసాగుతూ ఉండగా.. ఈ షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. పవర్ఫుల్ హోస్టింగ్ తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సల్మాన్ ఖాన్.. చమత్కారమైన వ్యాఖ్యలు.. కౌంటర్లతో షోకి ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చారు. అయితే తాజా వీకెండ్ ఎపిసోడ్లో సల్మాన్ ఖాన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో సల్మాన్ ఖాన్ ముఖం ఉబ్బిపోయి, కళ్ళు వాచినట్టు కనిపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ మద్యం తాగి బిగ్ బాస్ ఎపిసోడ్ హోస్ట్ గా చేశాడా? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆయన ప్రవర్తన కూడా విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించడంతో అసలు సెన్స్ ఉండక్కర్లేదా అంటూ కొంతమంది విరుచుకుపడుతున్నారు.
ALSO READ:Bigg Boss 9 : టాస్క్‌లో బిగ్ ట్విస్ట్… రెండో సారి కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయేల్!
ఈ ఆరోపణలను సల్మాన్ ఖాన్ అభిమానులు ఖండిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇటీవల చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారని.. దాంతోనే ఆయన అలసిపోయి కనిపించారని చెప్పుకొచ్చారు.. దీనికి తోడు మహాభారత సీరియల్ నటుడు పంకజ్ ధీర్ మరణించడంతో ఆ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన జాయ్ ఫోరమ్ 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుంచీ ఇండియాకి వచ్చి తన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొని.. వెంటనే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ కి హాజరయ్యారు. ఇలా బిజీ షెడ్యూల్ వల్ల ఆయన సరిగ్గా నిద్ర పోలేదని.. ఆ కారణంతోనే కళ్ళు వాచి
. ముఖం ఉబ్బినట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు
. ఏది ఏమైనా ఈ ఆరోపణలపై సల్మాన్ ఖాన్ అధికారికంగా స్పందిస్తే బాగుంటుందని నెటిజన్స్ కోరుతున్నారు.