Flipkart Big Bang Sale: ఫ్లిప్‌కార్ట్ ఈ రోజు ఒక పెద్ద వేడుకలా మారిపోయింది. ఎందుకంటే ఎంతో మంది ఎదురుచూసిన బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ఇవాళ చివరి రోజుకి చేరుకుంది. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ భారీ ఆఫర్ల వర్షం ఇవాళ రాత్రి 12 గంటలతో ముగుస్తుంది. యాప్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా సేల్ ఎండ్స్ టుడే అని పెద్ద అక్షరాల్లో కనిపిస్తోంది.
రికార్డ్ స్థాయిలో ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ ఈసారి వినియోగదారుల కోసం తెచ్చిన ఆఫర్లు నిజంగా రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. మొబైల్స్ నుంచి ఫ్యాషన్ దుస్తుల వరకు, గృహోపకరణాలు నుంచి బ్యూటీ ప్రోడక్ట్స్ వరకు అన్నీ విభాగాల్లో తగ్గింపులు ఉన్నాయి.
మొబైల్స్ 40 శాతం వరకు డిస్కౌంట్
ఈసారి మొబైల్ విభాగంలో తగ్గింపులు రికార్డు స్థాయిలో ఉన్నాయి. సామ్‌సంగ్, నోవా, రెడ్మీ, ఐఫోన్ వంటి బ్రాండ్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఎస్‌బిఐ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అంటే మీరు ఒక ఫోన్ కొంటే వందల రూపాయలు తక్కువ ఖర్చవుతాయి. దీని వల్ల ఒక మంచి మొబైల్ తక్కువ ధరలో దొరకడం ఖాయం. ఈరోజే ఆర్డర్ చేస్తే ఫాస్ట్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది.
ఫ్యాషన్ విభాగంలో ఆఫర్లు
ఫ్యాషన్ విభాగం మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. మహిళల కోసం కొత్త పండుగ కలెక్షన్లు, పురుషుల కోసం ఫార్మల్స్, పిల్లల కోసం రంగురంగుల డ్రెస్సులు అన్నీ 50 నుంచి 80 శాతం వరకు తగ్గింపులో ఉన్నాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఎక్కువ సైజులు, కలర్స్ స్టాక్ అవుట్ అవుతున్నాయి. అందుకే చాలామంది తెల్లవారుజామునే తమ కార్ట్‌లో ఉన్న వస్తువులను చెక్‌అవుట్ చేస్తున్నారు.
ఇంటికి కావాలసిన పరకరాలపై భారీ తగ్గింపులు
ఇల్లు సర్దుకోవాలనుకునే వారికి గృహోపకరణాల విభాగం మామూలుగా ఉండదు. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, ల్యాప్‌టాప్ వంటి వస్తువులపై ఈ సేల్ మరింత ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇంటెల్ టెక్ స్పాన్సర్‌గా ఉండడం వల్ల ల్యాప్‌టాప్‌ల రేంజ్‌లో ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. స్టూడెంట్స్, వర్క్ ఫ్రం హోమ్ చేసే వారికీ ఇది మంచి అవకాశం.
Also Read: JioMart Bumper Offer: జియో మార్ట్ భారీ ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్‌లు రూ.6,399 నుంచే
బ్యూటీ, పర్సనల్ కేర్ ఆఫర్లు
బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగం కూడా పండుగ ఆఫర్లతో కళకళలాడుతోంది. లాక్‌మీ, మేబెలిన్, నైవియా, డవ్ వంటి ప్రముఖ బ్రాండ్స్ ఉత్పత్తులు తక్కువ ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ కొనుగోలు చేస్తే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీ గిఫ్ట్ ర్యాపింగ్ ఆప్షన్ కూడా ఇస్తోంది. ఈ సీజన్‌లో గిఫ్ట్‌లు ఇవ్వాలని అనుకునే వాళ్లకి ఇది సరైన సమయం.
పిల్లల కోసం ప్రత్యేక ఆఫర్లు
పిల్లల కోసం స్కూల్ బ్యాగ్స్, టాయ్స్, కిడ్స్ వేర్ కూడా భారీ తగ్గింపులో ఉన్నాయి. యాప్‌లోకి వెళ్ళగానే ఇంకా వీటి కోసం చూస్తున్నాను అని చూపిస్తూ మీరు ఆడ్ చేసుకున్న పెట్టుకున్న వస్తువులను మళ్లీ సూచిస్తోంది. ఈ పర్సనల్ సజెషన్ ఫీచర్ వల్ల మీకు కావలసిన వస్తువులను మరింత వేగంగా కనుగొనవచ్చు.
ఇవాళే చివరి అవకాశం
ఫ్లిప్‌కార్ట్ సేల్ ఇవాళ రాత్రి వరకు మాత్రమే కొనసాగుతుంది. అంటే ఈ రోజు రాత్రి తర్వాత ఈ అన్ని ఆఫర్లు ముగుస్తాయి. రేపటి నుండి ధరలు మామూలు స్థాయికి తిరిగి వెళ్ళిపోతాయి. చాలామంది చివరి నిమిషంలో ఆర్డర్లు పెడుతుండడంతో సర్వర్లు బిజీగా ఉంటాయి. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే యాప్‌లో లాగిన్ అయ్యి ఆర్డర్ పూర్తి చేయడం మంచిది. ఇప్పుడు చివరి గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు కొత్త మొబైల్, జ్యువెలరీ సెట్స్, లేదా గిఫ్ట్ ఐటమ్స్ ఏదైనా కొనాలని అనుకుంటే ఇవాళే ఆర్డర్ పెట్టండి.
ఆకట్టుకున్న ఆఫర్లు
ఈ సంవత్సరం దీపావళి సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన ఆఫర్లు దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో ఉత్సాహం నింపాయి. ప్రతి ఒక్కరికి సరిపడే వస్తువులు, ధరలు, బ్రాండ్లు, ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో పండుగ షాపింగ్ మరింత సులభమైంది. ఫ్లిప్‌కార్ట్ ఇచ్చిన సూపర్‌కాయిన్స్, ఫ్రీ డెలివరీ, క్యాష్‌బ్యాక్ వంటి సదుపాయాలు వినియోగదారులను ఆకట్టుకున్నాయి.