Arjun Chakravarthy OTT : ప్రతి శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ముందుగానే స్ట్రీమింగ్ డేట్ ని లాక్ చేసుకుంటే.. మరికొన్ని సినిమాలు మాత్రం సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి.. ఇవాళ దాదాపు 15 సినిమాల వరకు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. వెబ్ సిరీస్ లు కూడా ఆసక్తిగా ఉండడంతో మూవీ లవర్స్ కు పండగే.. ఇదిలా ఉండగా.. తాజాగా మరో స్పోర్ట్స్ డ్రామా మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ మూవీ పేరు అర్జున్ చక్రవర్తి.. కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ స్టోరీ గురించి, అదేవిధంగా ఓటిటి ప్లాట్ ఫామ్ గురించి వివరంగా తెలుసుకుందాం..
విజయ్ రామ రాజు, సీజ్జా రోజ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ అర్జున్ చక్రవర్తి.. ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ దర్శకుడు విక్రాంత్ రుద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత శ్రీ ని గుబ్బల ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనో, స్టోరీలో అక్కడక్కడ లోపాలు ఉండడం వల్ల తెలియదు కానీ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో దాదాపు రెండు నెలల కు డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి వచ్చేసింది. అయితే ముందుగానే ఎటువంటి అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకుని ఈ సినిమా కనీసం ఎక్కడైనా భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి..
Also Read : ఇదేం దరిద్రం రా నాయనా.. చెండాలమైన టాస్క్.. మళ్లీ గొడవలా..?
ఈమధ్య తెలుగు ఇండస్ట్రీ నుంచి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుంది అని చెప్పలేము. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విషయాన్ని కొల్లగొడితే.. మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి సినిమానే ఈ అర్జున్ చక్రవర్తి. మంచి పాయింట్ తో సినిమా తీసిన సరే కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల ఈ సినిమా థియేటర్లలో ఆడలేకపోయింది. ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఈ స్టోరీ 1990.. అర్జున్ ఓ అనాధ బాలుడిని రంగయ్య నీవు కబడి ప్లేయర్ చీర తీసి పెంచి పెద్ద చేస్తాడు. అతనికి చదువు చెప్పిస్తూనే మరోవైపు కబడ్డీ గురించి అన్ని మెలకువలు నేర్పిస్తాడు. ఓసారి కాబట్టి ఆటని నేషనల్ లెవెల్ లో ఆడాలని అర్జున్ ఎంతో ఆశ పడుతూ ఉంటాడు. తను ప్రేమించిన అమ్మాయి వల్ల.. తనని పెంచిన రంగయ్య వల్ల తన కోరిక నెరవేరకుండా పోతుంది. కానీ మళ్లీ కబడి పై ఉన్న ఆసక్తిని వదలకుండా కష్టపడతాడు. కొత్త కోచ్ ద్వారా కబడ్డీ ప్లేయర్ గా నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అసలు ఈ అర్జునుని ప్రేమించిన అమ్మాయి ఎవరు? రంగయ్య జీవితం గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అర్జున్ ఎదురైన సంఘటనలు సినిమా స్టోరీ గా ఉంటుంది…. స్టోరీ బాగానే ఉంది కానీ చిన్న తప్పులు వల్ల సినిమా ఫ్లాప్ అయింది. అక్కడ పెద్దగా ఆకట్టుకొని ఏ మూవీ, ఇక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..