Telangana Mega Job Fair: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెగా జాబ్ మేళాను రెండురోజుల పాటు నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటివరకు 30 వేలకు పైగానే నిరుద్యోగులు పేర్లు నమోదు కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెండురోజూ జాబ్ మేళా కొనసాగనుంది. ఒక విధంగా చెప్పాలంటే యువతీ యువకులకు ఊహించని శుభవార్త.
నిరుద్యోగులకు మరొక కబురు
అక్టోబర్ 25 నుంచి అంటే శనివారం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ప్రాంతంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ జాబ్ ఫెయిర్ రెండో రోజు కొనసాగించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వేలాది మందికి పైగా నిరుద్యోగులు జాబ్ మేళాలో పేర్లు నమోదు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జాబ్ మేళాలో పాల్గొననున్న నిరుద్యోగ యువతీ-యువకులకు ఇంకా సమయం ఉంది. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో రెండో రోజు కొనసాగించాలని భావిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం నల్లగొండ, భువనగిరి యాదాద్రి, సూర్యాపేట జిల్లాల ప్రభుత్వ యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
మెజా జాబ్ మేళా రెండురోజులు
ఎక్కువ మంది నిరుద్యోగులు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవడంతో రెండోరోజు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. నిరుద్యోగులకు ఈ సమాచారం అందించేలా మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయాన్ని తక్షణమే గ్రామ కార్యదర్శుల ద్వారా సమాచారం చేర వేయాలని సూచనలు చేశారు మంత్రి. కనీవినీ ఎరుగని రీతిలో నిరుద్యోగులు జాబ్ మేళాకు తరలి వస్తున్నట్లు పేర్కొన్నారు.
జాబ్ ఫెయిర్ సెంటర్ వద్ద రద్దీ పెరగకుండా క్రమబద్దీకరించేందుకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మెగా జాబ్ మేళాకు ఇప్పటివరకు 30వేల పైచిలుకు నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. జాబ్ ఫెయిర్‌కు వచ్చే నిరుద్యోగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ALSO READ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల.. రంగంలోకి బడా నేతలు
ఈ జాబ్ మేళాలో దాదాపు 255 పై చిలుకు పరిశ్రమల వివరాలను కేటగిరీ వారిగా విభజించారు. పూర్తి వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శన చేశారు. అలాగే నిరుద్యోగుల సంఖ్యకు అనుగుణంగా అల్పాహారం, భోజనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం ప్రతీ ఆర్టీసీ బస్ ఆ ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
నిరుద్యోగులకు అసౌకర్యం కలుగకుండా ఉండేలా వాలంటరీలు రంగంలోకి దిగనున్నారు. అంతేకాదు ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉద్యోగాల్లో ఫైనాన్స్, హెచ్ఆర్, ఐటీ, బయోటెక్, డిజిటల్ మీడియా, మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్ సేల్స్, టెలి కాలింగ్, అడ్మినిస్ట్రేషన్, కస్టమర్ సపోర్టుతోపాటు మరికొన్ని విభాగాలున్నాయి. మినిమం శాలరీ 2 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉండనుంది.