Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరీ ట్రావెల్స్ బస్సు, కర్నూలు శివారులోని చిన్న టేకూరు దగ్గర జాతీయ రహదారి 44 పై అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 19 మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు ప్రయాణికుల జాబితా చూస్తే..
బస్సు ప్రయాణికుల జాబితా..
అశ్విన్‌రెడ్డి (36)
జి. ధాత్రి (27)
కీర్తి (30)
పంకజ్ (28)
యువన్ శంకర్ రాజు (22)
తరుణ్ (27)
ఆకాశ్ (31)
గిరిరావు (48)
బున సాయి (33)
గణేష్ (30)
జయంత్ పుష్వాహా (27)
పిల్వామిన్ బేబి (64)
కిశోర్ కుమార్ (41)
రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులు
రమేష్ (30)
అనూష (22)
మహ్మద్ ఖైజర్ (51)
దీపక్ కుమార్ (24)
అండోజ్ నవీన్‌కుమార్ (26)
ప్రశాంత్ (32)
ఎం. సత్యనారాయణ (28)
మేఘనాథ్ (25)
వేణు గుండ్ (33)
చరిత్ (21)
చందన మంగ్ (23)
సంద్యారాణి మంగ్ (43)
గ్లోరియా ఎల్లెస్ శ్యామ్ (28)
సూర్య (24)
హారిక (30)
శ్రీహర్ష్ (24)
శివ్ (24)
శ్రీనివాసరెడ్డి (40)
సుబ్రహ్మణ్యం (26)
కె. అశోక్ (27)
ఎం. జి. రామారెడ్డి (50)
ఉమాపతి (32)
అమృత్ కుమార్ (18)
వేణుగోపాల్ రెడ్డి (24)
ప్రాథమిక సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నేషనల్ హైవే-44 పై బైక్‌ని ఢీ కొట్టింది ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవదహనం అయ్యారు. చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో 19 పైగా మృతి చెందగా.. ఎమర్జెన్సీ డోర్ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కర్నూల్ బస్సు ప్రమాదంలో 19 మృతదేహాలు గుర్తింపు
కర్నూలు రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బస్సులో 19 మృతదేహాలను గుర్తించి.. వాటిని వెలికితీశారు ఫోరెన్సిక్ బృందాలు.
కర్నూలు బస్సు ప్రమాదం – హెల్ప్‌లైన్ ఏర్పాటు
బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
హెల్ప్ లైన్ నెంబర్లు.. సంప్రదించాల్సిన అధికారులు:
9912919545 ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
9440854433 ఈ.చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్
ఈ నేపథ్యంలో బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010
బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.