
Pranitha Subhash (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందంతోనే కాదు అభినయంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సోయగాల సుందరి నిత్యం అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

Pranitha Subhash (Image credit: Instagram)
నిజానికి ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ తరగని అందంతో చెక్కుచెదరని రూప లావణ్యంతో అభిమానులను సెలబ్రిటీలను సైతం మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Pranitha Subhash (Image credit: Instagram)
ఇకపోతే ఏం పిల్లో ఏం పిల్లడో అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో తనీష్ హీరోగా నటించారు. ఆ తర్వాత సిద్ధార్థ హీరోగా నటించిన బావ సినిమాలో మరోసారి ప్రేక్షకులను అలరించింది.

Pranitha Subhash (Image credit: Instagram)
పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో మరింత పాపులారిటీ అందుకున్న ప్రణీత.. కెరియర్ పీక్స్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైంది. పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తోంది.

Pranitha Subhash (Image credit: Instagram)
తాజాగా వైట్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. అమ్మడిని చూసిన అభిమానులు చాలా అందంగా జాబిల్లిలా తన మోముతో హాయిని కలిగిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Pranitha Subhash (Image credit: Instagram)
మొత్తానికైతే ప్రణీత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు అందుకోవడానికి ఈ విధంగా అందాలు ఆరబోస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.