Raashii Khanna Latest Photos: ఇటీవల దుబాయ్‌లో ఐఫా అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భామలంతా ఒకరికి మించి మరొకరు రెడీ అయ్యారు. బ్లూ ఫ్రాక్‌తో రాశి ఖన్నా కూడా ఫ్యాన్స్ చూపు తిప్పుకోనివ్వలేదు.
మూడు రోజుల పాటు ఐఫా వేడుకలు జరగగా అందులో ఒకరోజు రాశి ఖన్నా స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది.
మరొక రోజు బ్రూ ఫ్రాక్‌లో అందరినీ ఆకట్టుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా లైకుల మీదు లైకులు వచ్చేస్తున్నాయి.
ఏ అవార్డ్ ఫంక్షన్ అయినా చాలావరకు స్టేజ్ ఎక్కి పర్ఫార్మ్ చేసే నటీమణుల్లో రాశి ఖన్నా ముందుంటుంది.
ఐఫాలో కూడా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఇండియన్ సెలబ్రిటీలను ఎంటర్‌టైన్ చేసింది రాశి.
ఇక సినిమాల విషయానికొస్తే.. తను చివరిగా సుందర్ సీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరణ్మనై 4’లో నటించింది.
ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో నాలుగు సినిమలు ఉండగా అందులో ఒకటి మాత్రమే తెలుగు చిత్రం ఉంది.
నీరజా కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో రాశి ఖన్నా ఒక హీరోయిన్‌గా నటిస్తోంది.