EPAPER

Tension: సిద్ధిపేట జిల్లాలో టెన్షన్..టెన్షన్… గ్రామస్తుల ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోయిన పోలీసులు.. చివరకు..

Tension: సిద్ధిపేట జిల్లాలో టెన్షన్..టెన్షన్… గ్రామస్తుల ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోయిన పోలీసులు.. చివరకు..

Tension at Siddipet District: సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పోలీసులు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి ఇంటిపై గ్రామస్తులు దాడి చేశారు. వారిలో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు తరలిస్తుండగా గ్రామస్తులంతా అడ్డుకున్నారు. అనంతరం వారు పోలీసుల వాహనాలు ముందుకు కదలకుండా పెద్ద ఎత్తున అక్కడే ధర్నా చేపట్టారు. వారిని వెంటనే విడిచిపెట్టాలంటూ డిమాండ్ చేశారు. నిందితుడి ఇంటిపై గ్రామస్తులమంతా దాడి చేశామని… కానీ, కేవలం 9 మందిపైనే ఎందుకు కేసులు నమోదు చేశారంటూ వారు పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. కేసులు నమోదు చేస్తే గ్రామస్తులందరిపైనా నమోదు చేయాలంటూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కానీ, అలా కాకుండా కావాలనే ఇలా చేయడమేంటని పోలీసులను నిలదీశారని సమాచారం. పోలీసులు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు వినకపోవడంతో పోలీసులు చేసేదేమీలేక చివరకు అక్కడి నుంచి ఆ తొమ్మిదిమందిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో చాలాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రామస్తులు వెనక్కి తగ్గకుండా రోడ్డుపై ధర్నా చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


Also Read: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్యకర్తలు?

ఈ ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆ గ్రామంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామంపై గట్టి నిఘా పెట్టారు. ఊరు శివారు దారుల్లో పోలీసులు పహారా కాస్తూ కొత్తవారిని రానివ్వడంలేదు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వారు వచ్చినా వారి వివరాలను తెలుసుకుంటూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామం ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది.


ఇటు గ్రామస్తులకు కూడా పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో తమకు సహకరించాలని కోరారు. అదేవిధంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Also Read: సెలవు దినాల్లో ఎందుకు కూల్చుతున్నారు? హైడ్రాను ప్రశ్నించిన హైకోర్టు

ఇదిలా ఉంటే… గురవున్నపేట గ్రామానికి చెందిన బాలికపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశాడు. శనివారం బాలికకు తీవ్ర కడుపునొప్పి రావడంతోపాటు బ్లీడింగ్ కావడంతో తల్లిదండ్రులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ యువకుడి ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు, అతని కుటుంబ సభ్యులు ఊరి నుంచి పరారయ్యారు. అనంతరం గ్రాస్తులు ఇంటిపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అందరినీ చెదరగొట్టారు. కాగా, నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వారు చెబుతున్నారు.

Related News

Professor Saibaba : మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత… సంతాపం తెలిపిన సీపీఐ నారాయణ

CPI Narayana: పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

Dasara: పండుగ రోజు ఇటువంటి కానుక ఊహించరు కూడా.. ఆల్ ఫ్రీ అంటూ తెగ పంచేశారు.. ప్రజలు క్యూ కట్టారు

Kondareddy Palli : కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ… దసరా గూస్ బంప్స్

CM Revanth Reddy : కొండారెడ్డిపల్లికి మహర్ధశ… మోడల్ విలేజ్’గా సీఎం స్వగ్రామం

Durga Mata Idol Vandalised: విగ్రహం ధ్వంసం కేసులో ఒకరి అరెస్ట్.. ఘటనకు అసలు కారణం చెప్పిన డీసీపీ

Telangana BJP: మొత్తం మార్చండి.. స్పీడ్ పెంచాలి.. పార్టీ అధిష్టానం గురి పెట్టింది.. బీజేపీ ఇంచార్జ్ పాటిల్

Big Stories

×