E-Paper
Advertisement

OTT Movie : బిల్డింగ్ లో మర్డర్ మిస్టరీ… ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది… ఇంటెన్స్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : బిల్డింగ్ లో మర్డర్ మిస్టరీ… ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది… ఇంటెన్స్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కొరియన్ సిరీస్ లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ సిరీస్ లకు బాగా అలవాటు పడుతున్నారు ప్రేక్షకులు. వీటిలో రొమాంటిక్, థ్రిల్లర్ జానర్ లను మరింతగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కొరియన్ థ్రిల్లర్ సిరీస్ గురించి చెప్పుకుందాం. నాలుగు ఎపిసోడ్‌ లు ఉన్న ఈ సిరీస్ ఒక అమ్మాయి మర్డర్ చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ లో అసలు మిస్టరీ రివీల్ అవుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

కథలోకి వెళ్తే

సియోల్‌లోని గ్యాంగ్‌నామ్‌లో రీ కనస్ట్రక్షన్ కి సిద్ధమవుతున్న గూంగ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో, సూ-జిన్ అనే ఒక యువతి బాల్కనీ నుంచి పడి చనిపోయినట్లు కనిపిస్తుంది. అపార్ట్‌మెంట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ “మిస్ లీ”గా పిలవబడే లీ గూంగ్-బోక్ అనే మహిళ, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. సూ-జిన్ మరణం గురించి ఎక్కువగా తెలుసుకున్నవారిలో ఆమె కూడా ఒకరు. సూ-జిన్‌ సెల్‌ఫోన్‌ను గూంగ్-బోక్ దాచిపెడుతుంది. ఇది కేసులో కీలకమైన సాక్ష్యం గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ హో-చుల్ అనే డిటెక్టివ్ ఈ కేసును విచారించడానికి వస్తాడు. ఆమె మరణం ఆత్మహత్య కాదని, గొంతు పిసికి చంపిన హత్య అని ఆటోప్సీ ద్వారా తెలుస్తుంది. సూ-జిన్ గర్భవతిగా ఉందని, ఆమె తల్లి మూడేళ్ల క్రితం హిట్-అండ్-రన్ ప్రమాదంలో కోమాలో ఉందని తెలుసుకుంటారు.

Advertisement

హో-చుల్ కూడా తన తమ్ముడు లీ మ్యుంగ్-వోన్‌ను కాపాడడానికి కొన్ని ఆధారాలను దాచిపెడతాడు. దీనితో గూంగ్-బోక్, హో-చుల్ ఇద్దరూ ఒకరినొకరు అనుమానిస్తూ, కేసును పరిష్కరించడానికి కలిసి పనిచేస్తారు. అపార్ట్‌మెంట్ కొంతమంది సందేహాస్పదంగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రహస్యాన్ని దాచిపెడుతూ ఉంటారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, సూ-జిన్ మరణం వెనుక ఉన్న నిజం బయటపడుతుంది. సూ-జిన్, మ్యుంగ్-వోన్‌తో సంబంధం కలిగి ఉంటుంది. ఆమె ఫోన్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బాల్కనీ నుంచి పడిపోతుంది. కానీ అప్పటకీ ఆమె ఇంకా బతికే ఉంటుంది. మ్యుంగ్-వోన్ భార్య యూ-రా, సూ-జిన్‌తో అతని వ్యవహారం గురించి తెలిసి, ఈర్ష్యతో ఆమెను గొంతు నులిమి చంపేస్తుంది. ఈ హత్య యూ-రా కారు కెమెరాలో రికార్డ్ అవుతుంది. దీనినే గూంగ్-బోక్ దాచిపెడుతుంది. ఇక ఇన్వెస్టిగేషన్, ట్విస్టులతో ఈ స్టోరీ మొత్తం మిస్టరీ అంతా క్లైమాక్స్ లో బయట పడుతుంది. నేరస్తులు ఎవరు ? సూ-జిన్ ను చంపడానికి నిజమైన కారణం ఏమిటి ? ఆధారాలను ఎందుకు దాచిపెడుతున్నారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘షీ నోస్ ఎవ్రీథింగ్’ (She Knows Everything) 2020లో విడుదలైన కొరియన్ మినీ-సిరీస్. నాలుగు ఎపిసోడ్‌లతో, లీ హ్యాంగ్-మిన్ దర్శకత్వంలో, కాంగ్ సంగ్-యాన్ (లీ గూంగ్-బోక్), జో హాన్-సన్ (ఇన్ చియోల్-హో) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది MBCలో 2020 జూలై 8 నుండి 16 వరకు ప్రసారమై, 1 గంట 10 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదేళ్ల తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. హిందీ డబ్బింగ్‌తో బిలిబిలి టీవీలో కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×