Team India : సెప్టెంబర్ 09 నుంచి ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆసియా కప్ మ్యాచ్ ఎప్పుడూ ప్రారంభం అవుతుందా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆసియా కప్ 2025 (Asia Cup 2025) గురించి వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా (Team India) ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav), హార్దిక్ పాండ్యా, శుబ్ మన్ గిల్ (Shubhman Gill) వంటి వారు తమ హెయిర్ స్టైల్ తో ఫొటోల్లో కనిపిస్తున్నారు. మ్యాచ్ కి ముందు వీళ్లు ఇలా ఓవర్ చేస్తున్నారు. వీళ్లు కప్ అయితే గెలవకపోనీ.. అప్పుడు వీళ్ల సంగతి చెబుదాం అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇంకా వీరి హెయిర్ స్టైల్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోకుండ ఏంటీ ఈ వేషాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Hardik Pandya : హార్దిక్ పాండ్యా వాచ్ ధర ఎంతో తెలుసా… పాకిస్తాన్ బాబర్ ఆస్తులు మొత్తం అమ్ముకున్న సరిపోదు
టీమిండియా (Team India) ఆటగాళ్లు రకరకాల హెయిర్ స్టైల్ తో కనిపిస్తుండటంతో వాళ్ల గురించి క్రికెట్ (Cricket) అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఆసియా కప్ (Asia CUp) టీ-20 ఫార్మాట్ లో కొనసాగుతోంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా.. గ్రూపు ఏ, గ్రూపు బీ గా విభజించారు. గ్రూపు ఏ లో బంగ్లాదేశ్, అప్గానిస్తాన్, శ్రీలంక, హాంకాంగ్ ఉండగా.. గ్రూపు బీ లో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ ఉన్నాయి. లీగ్ దశలో గ్రూప్ ఏ కి సంబంధించిన మ్యాచ్ లు అన్నీ అబుదాబీ వేదికగా జరిగితే.. గ్రూపు బీ కి సంబంధించిన మ్యాచ్ లు అన్నీ దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. మ్యాచ్ లు అన్ని కూడా భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. సెప్టెంబర్ 15న మాత్రం.. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఒమన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ జరుగబోతుంది.
వాస్తవానికి లీగ్ దశలో ప్రతీ జట్టు మూడు మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తరువాత సూపర్ 4 రౌండ్ ఉంటుంది. చివరికీ సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆసియా కప్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా (Team India) తొలి మ్యాచ్ లీగ్ దశలో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అలాగే సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్ జట్టుతో హోరా హోరీ పోరు తలపడనుంది. ఇందులో కనుక టీమిండియా (Team India) విజయం సాధించకపోతే..అభిమానులు టీమిండియా (Team India) ఆటగాళ్ల దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తారని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ ( Pakistan) పై ఎప్పుడైనా టీమిండియా విజయం సాధిస్తుందనే నమ్మకం అయితే ఉందని మరికొందరూ పేర్కొంటున్నారు. ఇక మరోవైపు టీమిండియా ఆటగాళ్లు ఖరీదైన వాచ్ లు, విభిన్న స్టైల్ లో హెయిర్ స్టైల్.. మ్యాచ్ ప్రాక్టీస్ లో ఫొజులు కొడుతున్నారంటూ టీమిండియా (Team India) ఆటగాళ్ల పై ట్రోలింగ్స్ (Trolings) చేస్తున్నారు. అలాగే రకరకాలుగా మీమ్స్ కూడా క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.