
Rakul Preet Singh (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.

Rakul Preet Singh (Image credit: Instagram)
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రార్థన అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రార్థన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అనే డైలాగ్ తో ఊహించని ఇమేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Singh (Image credit: Instagram)
ఇక ఒక్కో మెట్టు ఎదుగుతూ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర తారలతో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే.

Rakul Preet Singh (Image credit: Instagram)
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జాకీభగ్నానీ తో ఏడడుగులు వేసిన ఈమె అక్కడే సినిమాలు చేస్తూ తన భర్త సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటుంది. ఇక అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో ఆకట్టుకునే ఈమె తాజాగా వైట్ డ్రెస్ లో అభిమానులను మెప్పించే ప్రయత్నం చేసింది.

Rakul Preet Singh (Image credit: Instagram)
స్ట్రాప్ కలిగిన వైట్ డ్రెస్ ధరించి అందులో దేవకన్యలా కనిపించింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చాలా అందంగా ముస్తాబయింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Rakul Preet Singh (Image credit: Instagram)
ముఖ్యంగా కొంతమంది గార్జియస్ అని కామెంట్ చేస్తే.. మరి కొంతమంది ఈమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ కామెంట్లు పెడుతున్నాయి. ఇకపోతే ఈ ఫోటోలను షేర్ చేస్తూ.." ఈరోజు మనసు కవిలా కవిత్వంలా అనిపిస్తోంది. ఎగురుతున్న మనసుకి కిందికి దిగడం ఎలాగో తెలియడం లేదు" అంటూ క్యాప్షన్ జోడించింది.