E-Paper
Advertisement

బహిరంగ చర్చకు సిద్ధమా..? ఎమ్మెల్యే బండారు శ్రావణికి కార్య‌క‌ర్త స‌వాల్‌

బహిరంగ చర్చకు సిద్ధమా..? ఎమ్మెల్యే బండారు శ్రావణికి  కార్య‌క‌ర్త స‌వాల్‌
Advertisement

Singanamala: శింగనమల రాజకీయాల్లో ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ అయింది. సాధారణంగా పార్టీలో ఎమ్మెల్యే మాటే శాసనం అని అందరూ అనుకుంటారు. కానీ, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. సొంత పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై గార్లదిన్నె మండలం కనుంపల్లికి చెందిన ప్రసాద్ అనే దళిత టీడీపీ కార్యకర్త గళం ఎత్తడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ప్రసాద్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను చూస్తే, ఒక కార్యకర్త ఎంతలా ఆవేదన చెందుతున్నాడో అర్థమవుతుంది. ఎమ్మెల్యే శ్రావణి అవినీతికి పాల్పడుతున్నారని, డబ్బు కోసం సొంత పార్టీ నేతలను, కార్యకర్తలను అణచివేస్తున్నారని ఆయన నేరుగా ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడితో ఆగకుండా, ‘మీరు చేసిన అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసరడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

Advertisement

అయితే ఈ గొడవకు అసలు కారణం ఇటీవల ఎమ్మెల్యే కనుంపల్లి గ్రామానికి వెళ్లినప్పుడు జరిగిన సంఘటన. తన గోడు చెప్పుకుందామని వెళ్లిన ప్రసాద్‌ను, అతని కుటుంబ సభ్యులను పోలీసులు ఈడ్చుకెళ్లడం కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఒక పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలను ఇలా అవమానించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా? లేదా ఎమ్మెల్యే ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్తే ఎమ్మెల్యేపై ఇలా తిరుగుబాటు చేయడం శ్రావణికి రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.

Also Read:నువ్వు మొగోడివైతే చర్చకు రా.. బండి సంజయ్‌కి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్

Advertisement

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×