BigTV English
Advertisement

Viral Video: ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు.. తినే ప్లేట్లకూ పే చేయాలట, భలే విచిత్రంగా ఉందే!

Viral Video: ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు.. తినే ప్లేట్లకూ పే చేయాలట, భలే విచిత్రంగా ఉందే!

తరచుగా చాలా మంది ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్తుంటారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి హ్యాపీగా తినేస్తారు. తిన్న ఫుడ్ కు బిల్ కట్టేసి వెళ్తారు. కానీ, ఆర్డర్ చేసే ఫుడ్ తో పాటు తిన్న కంచాలకూ బిల్ వేస్తే ఎలా ఉంటుంది? అందరూ షాకవ్వడం పక్కా. తాజాగా ఓ ఇండియన్ యువతికి అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఫుడ్ తో పాటు తిన్న ప్లేట్లకు బిల్ వేయడంతో బిక్క ముఖం వేసింది. చచ్చుకుంటూ బిల్ పే చేసి బయటకు వచ్చింది. తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

వాగ్మితా సింగ్ అనే ఓ ఇండియన్ కంటెంట్ క్రియేటర్ తాజాగా ఇటలీకి వెళ్లింది. కొద్ది రోజుల పాటు అక్కడే ఉంది. పర్యాటక ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేసింది. ఒక రోజు ఫేమస్ రెస్టారెంట్ కు వెళ్లింది. చక్కగా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసింది. ఒక్కో ఐటెమ్ ను తింటూ ఎంజాయ్ చేసింది. బిల్లు వచ్చే వరకు అంతా నార్మల్ గానే ఉంది. తినడం పూర్తయ్యాక వెయిటర్ బిల్లు తీసుకొచ్చాడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు ఆ ఫుడ్ తిన్న ప్లేట్లకూ బిల్ వేయడం చూసి ఆశ్చర్యపోయింది. కాసేటి తర్వాత వెయిటర్ ను పిలిచి తిన్న కంచాలకు బిల్ వేయడం ఏంటని ప్రశ్నించింది వాగ్మితా. అతడు వెంటనే ఆమె వైపు అదో రకంగా చూసి, ఇక్కడ ఇలా బిల్ వేయడం కామన్ అని చెప్పాడట. అంతేకాదు, తిన్న కంచాలకు, కూర్చునే చైర్, టేబుల్ సెట్టింగ్స్, బ్రెడ్, వాటర్, తినే ఫోర్క్ కు కూడా ఈ బిల్లు వేస్తారని చెప్పాడట. కోపెర్టో అనేది చాలా కాలంగా ఉన్న ఇటాలియన్ ఆచారం అని, దేశ వ్యాప్తంగా అనేక రెస్టారెంట్లలో ఈ విధానం ఉందని వివరించాడు. ఆ తర్వాత ఆమె బిల్లు కట్టేసి వచ్చినట్లు చెప్పుకొచ్చింది.

వేడి నీళ్లు ఇవ్వమని అడిగినా..

అటు వాగ్మితా కు గొంతు నొప్పిగా ఉండటంతో రమ్, వేడి నీటిని  ఇవ్వాలని అడిగిందట. వెంటనే వెయిటర్ చెక్ చేయాలని ఉందని చెప్పాడట. ఆమె స్నేహితుడు ఐస్ లేకుండా వాటర్ అడిగినప్పుడు, తనకు కూడా ఇదే సమాధానం చెప్పినట్లు వివరించింది. చేసేదేమీ లేక వాటర్ లో ఉన్న ఐస్ తీసేసి యూజ్ చేసినట్లు వాగ్మితా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ఇటాలియన్ భోజన సంప్రదాయాలు నవ్వు కలిగించడంతో పాటు ఉత్సాహాన్ని కలిగించాయి. ఎప్పుడైనా మీరు కూడా ఇటలీకి వెళ్తే, తినే కంచాలకు కూడా బిల్ కట్టాలనే ఆలోచన ఉంటేనే రెస్టారెంట్ కు వెళ్లండి!


Read Also:  ఏసీలో ఎక్కువ సేపు గడిపితే.. ఎప్పటికి ముసలోళ్లు అవ్వరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?

Related News

Bus Fire Tragedies: బస్సులో బతుకులు ‘బుగ్గి’.. ప్రమాదాల సమయంలో ఎదురవుతున్న అడ్డంకులు ఇవే!

IRCTC Special Trip: రామేశ్వరం TO తిరుపతి, దక్షిణ దర్శనం పేరుతో IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ!

IRCTC: టికెట్ బుకింగ్ లో నో ఫుడ్ ఆప్షన్ తీసేశారా? కచ్చితంగా ఫుడ్ బుక్ చేసుకోవాలా?

Flight Ticket: జస్ట్ రూపాయికే విమాన టికెట్, ఇండిగో అదిరిపోయే ఆఫర్!

Blast on Railway Track: ట్రాక్ పై బాంబు పేలుడు, రైల్వే సర్వీసులు బంద్!

IRCTC Tickets: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Watch Video: రైల్వే ట్రాక్ మీద రీల్స్.. దూసుకొచ్చిన రైలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు!

Big Stories

×