Samyuktha Menon(Source: Instragram)
ప్రముఖ మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2016లో 'పాప్ కార్న్' అనే మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. తెలుగు, తమిళ్, కన్నడ భాషా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది.
Samyuktha Menon(Source: Instragram)
ఇక 2018లో కలరి అనే సినిమాతో తమిళ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సింది.
Samyuktha Menon(Source: Instragram)
కానీ కొద్దిగా ఆలస్యం కారణంగా 2022లో విడుదలైన భీమ్లా నాయక్ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి తొలి పరిచయమైంది. ఆ తర్వాత బింబిసారా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Samyuktha Menon(Source: Instragram)
ఇక ప్రస్తుతం స్వయంభు అనే సినిమాలో నటిస్తోంది. ఇక అలాగే శర్వ 37 మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకున్న సంయుక్త.. బిఎస్ఎస్ 12 మూవీలో కూడా అవకాశం దక్కించుకుంది.
Samyuktha Menon(Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా గ్రీన్ కలర్ చీరలో అందాలు చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేసింది.
Samyuktha Menon(Source: Instragram)
నెట్టెడ్ శారీ ధరించిన సంయుక్త పాక్షికంగా నడుము అందాలు కనిపించేలా.. తన అందాలను కప్పేసిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.