E-Paper
Advertisement

టైం లేనప్పుడు..ఈ టేస్టీ కిచిడిని ట్రై చేయండి!రుచి అదిరిపోతుంది

టైం లేనప్పుడు..ఈ టేస్టీ కిచిడిని ట్రై చేయండి!రుచి అదిరిపోతుంది
Advertisement

khichdi recipe: ఉదయం పూట ఆఫీసుకు వెళ్లే తొందరలో లేదా రాత్రి వేళ వంట చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అలాంటి బిజీ టైమ్‌లో కడుపు నిండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా ఏదైనా రుచికరమైన వంటకం చేయాలనుకుంటే..ఈ కిచిడి మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. కేవలం.. పది నిమిషాల్లో, కుక్కర్‌లో అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోగల ఈ ఇన్ స్టంట్ కిచిడి రెసిపీ ఎలా తయారు చేయాలో, దీనికి ఏయే పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

బియ్యం : 1 కప్పు

Advertisement

పెసరపప్పు : అర కప్పు

నెయ్యి లేదా నూనె: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

Advertisement

పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు

పచ్చిమిర్చి: 3 (సన్నగా చీల్చుకున్నవి)

అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్

ఉల్లిపాయ, టమాట: 1 చొప్పున

పసుపు: పావు టీస్పూన్

కారం ,ఉప్పు: రుచికి సరిపడా

నీళ్లు: 4 కప్పులు

కొత్తిమీర తరుగు: కొద్దిగా

తయారీ విధానం :

1.ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పు వేసి శుభ్రంగా కడగాలి. సమయం తక్కువగా.. ఉంది కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసి చిటపటలానివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా.. మగ్గిన తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.

2. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేయాలి. టమాటాలు మెత్తగా మగ్గే వరకు ఉడికించాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొద్దిగా కారం. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. దీని వల్ల కిచిడికి మంచి రంగు, రుచి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని కుక్కర్‌లో వేయాలి. మసాలాలతో పాటు పప్పు, బియ్యం రెండు నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. చివరగా కొద్దిగా కొత్తి మీర తరుగు వేసి కుక్కర్ మూత పెట్టాలి. మంటను మీడియం వేడిలో.. ఉంచి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

3. కుక్కర్ ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి చూడండి. గుమ గుమలాడే వేడి వేడి కిచిడి సిద్ధంగా ఉంటుంది. దీన్ని ఒక సారి గరిటెతో బాగా కలపాలి. చివరగా పైన మరో స్పూన్ నెయ్యి వేసుకుంటే దీని రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

Also Read: రుచికరమైన సేమ్యా పాయసం..ఈ కొలతలతో చేస్తే చల్లారినా గట్టిపడదు

చిట్కాలు:

కిచిడి మరింత హెల్దీగా ఉండాలంటే క్యారెట్, బఠాణీ, బీన్స్ వంటి కూరగాయ ముక్కలను కూడా పోపులో వేసుకోవచ్చు.

దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది, చల్లారితే గట్టి పడిపోతుంది కాబట్టి అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.

వంట చేయడానికి టేం లేనప్పుడు, కేవలం 10 నిమిషాల్లో ఈ ఇన్ స్టంట్ కిచిడిని తయారు చేసి మీ కుటుంబ సభ్యులకు రుచి చూపించండి. రుచితో పాటు కడుపు నిండే ఈ సింపుల్ వంటకాన్ని మీరు కూడా ఇప్పుడే ట్రై చేయండి.

Related News

రుచికరమైన సేమ్యా పాయసం..ఈ కొలతలతో చేస్తే చల్లారినా గట్టిపడదు

చాణక్య నీతి.. భర్తలు చేసే ఈ 5 తప్పులు వల్లే వైవాహిక జీవితం నాశనం

షుగర్ పేషెంట్లకు దీపావళి డైట్ ప్లాన్.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?

దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే అదృష్టం పట్టినట్లే.. ఈ సంకేతాలు శుభసూచకం

కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు మంచి అవకాశం వచ్చినా సంకోచిస్తారు

ఇంటికి చుట్టాలొస్తే మష్రూమ్ గలౌటీ కబాబ్ చేసి పెట్టండి.. టేస్ట్ అదిరిపోయిందని మెచ్చుకుంటారు!

బ్రెడ్‌తో ఇంత రుచికరమైన స్వీటా? పండగల స్పెషల్ ‘షాహీ టుక్డా’ను మీరు ట్రై చేసేయండి!

Big Stories

Advertisement
×