Shooting Holi: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హోలీ సంబరాలు జరుగుతున్న వేళ ఓ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ తన నివాసంలో కాల్పులకు గురయ్యారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యేతో పాటు భద్రతాధికారి సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పుల ఘటన ఎలా జరిగింది?
హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ పట్టణంలో హోలీ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. హోలీ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. ఆ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు.
స్థానికుల భయాందోళన
ఆ క్రమంలో కాల్పులు జరిపిన వెంటనే దుండగులు ఘటన స్థలాన్ని విడిచి పారిపోయారు. కాల్పుల శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాల్పుల ధాటికి బాంబర్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో భద్రతా అధికారి, మరొక వ్యక్తి కూడా గాయపడ్డారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Read Also: Business Idea: సున్నా పెట్టుబడి, ఒకేచోట కూర్చుని చేసే బిజినెస్
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన బాంబర్ ఠాకూర్‌ను బిలాస్పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భద్రతాధికారి పరిస్థితి కూడా ప్రస్తుతం అందుబాటులో ఉందని సమాచారం.
పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
బిలాస్పూర్ ఎస్పీ సందీప్ ధావన్ ఈ ఘటనపై స్పందించారు. మాజీ ఎమ్మెల్యేపై కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశామని, త్వరలోనే దుండగుడిని పట్టుకుంటామన్నారు. కాల్పులకు గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది.
సందర్శకుల వివరాలు కూడా
అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఒకే వ్యక్తి అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటన జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే వద్దకు వచ్చిన సందర్శకుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. దీంతోపాటు CCTV ఫుటేజ్ ను పరిశీలిస్తూ కాల్పుల వెనుక గల అసలు కారణాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు.
రాజకీయ కోణం ఉందా?
బాంబర్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత. గతంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత కక్షలే ఈ ఘటనకు కారణమా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబర్ ఠాకూర్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులకూ ఈ ఘటనకు సంబంధం ఉందా అనే అంశంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.