E-Paper
Advertisement

స్థానిక నేతలకు బీఆర్ఎస్ ప్రత్యేక బాధ్యతలు.. మారనన్న పొలిటికల్ సీన్?

స్థానిక నేతలకు బీఆర్ఎస్ ప్రత్యేక బాధ్యతలు.. మారనన్న పొలిటికల్ సీన్?
Advertisement

BRS Leadership: పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలం చేసే దిశగా బీఆర్ఎస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. ఇప్పటివరకు పార్టీ తరఫున ప్రభుత్వంపై విమర్శలు, రాజకీయ అంశాలపై స్పందన అంటే ప్రధానంగా కేటీఆర్‌, హరీశ్‌రావు వంటి అగ్రనేతలే ముందుండేవారు. అయితే ఇకపై ఈ బాధ్యతలను కేవలం కొద్దిమంది నాయకులకే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా అప్పగించాలని భావిస్తుంది. ప్రభుత్వ విధానాలు, స్థానిక సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేలా నాయకులకు బాధ్యతలు కేటాయించాలనే యోచన ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్‌పై అధికార పక్షం చేస్తున్న విమర్శలకు కూడా స్థానిక స్థాయిలోనే సమాధానాలు ఇచ్చేలా నేతలను సిద్ధం చేస్తుంది.

గతంలో పార్టీ అధికారం..

పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకత్వాన్ని తయారు చేయడం ఈ కార్యాచరణలో కీలక అంశం. గతంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల ద్వారా ప్రజల్లో కనిపించిన నేతలు.. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలోనూ అదే స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం, స్థానిక సమస్యలపై అధ్యయనం చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే నాయకత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

వాస్తవాలతో స్పందించేలా..

Advertisement

అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలు బీఆర్ఎస్‌ పాలన, గత ప్రభుత్వ నిర్ణయాలు, ప్రాజెక్టులు, ఆర్థిక అంశాలపై చేస్తున్న విమర్శలకు సమాధానాలు ఇవ్వడంలో ఇకపై స్థానిక నాయకులూ చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో కేటీఆర్‌, హరీశ్‌రావు స్పందన కోసం ఎదురుచూడకుండా.. సంబంధిత నియోజకవర్గ నేతలే తమ పరిధిలోని అంశాలపై వాస్తవాలతో స్పందించేలా బాధ్యతలు కల్పించాలనే ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానికంగా సమాచారాన్ని సేకరించి ప్రజల ముందుంచేందుకు సిద్ధమవుతుంది. విమర్శలకు వ్యక్తిగత ఆరోపణలతో కాకుండా అంశాలవారీగా, ఆధారాలతో సమాధానం ఇవ్వడంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

Also read: ఉరికొయ్యకు వేలాడిన తల్లి.. ఆ పాదాల చెంతే కన్నీటి పర్యంతమైన పసిగుండె!

ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు..

Advertisement

పార్టీ నేతలు నిత్యం ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించాలనే సూచన కూడా అధిష్ఠానం నుంచి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామాలు, పట్టణాలు, మండలాల వారీగా పర్యటనలు చేపట్టడం, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, బాధిత వర్గాలకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.స్థానికంగా ఏ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం స్పందించకపోతే ఆ అంశాన్ని రాజకీయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లేలా నేతలు పనిచేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నాయకులకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెరగడమే కాకుండా, నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు కూడా నిరంతరంగా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు.

కేడర్ కు సైతం బూస్ట్..

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్‌ తరఫున ప్రధానంగా కేటీఆర్‌, హరీశ్‌రావు వంటి నేతలే ప్రభుత్వంపై విమర్శలు, మీడియా సమావేశాలు, రాజకీయ ప్రతిస్పందనల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర నేతలకు కూడా బాధ్యతలు అప్పగిస్తే పార్టీ వాదన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అగ్రనేతలు రాష్ట్రస్థాయి రాజకీయ అంశాలు, కీలక విధానాలపై దృష్టి సారిస్తే.. నియోజకవర్గ స్థాయి నాయకులు స్థానిక సమస్యలు, ప్రజా కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై స్పందిస్తే ప్రజల్లోనూ చర్చజరుగుతుందని, పార్టీ సైతం బలోపేతం అవుతుందని, కేడర్ కు సైతం బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని పలువురు నేతలు పేర్కొంటున్నారు.

ప్రతి నియోజకవర్గంలో..

అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా, పార్టీ పదవుల్లో ఉన్న నేతలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో తమ ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నాయకులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ కేడర్‌లో కదలిక తీసుకురావాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడే నాయకులు తయారైతే పార్టీకి క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుంది. ద్వితీయశ్రేణి నాయకత్వం సైతం బలోపేతం అవుతుందని, భవిష్యత్ లో నేతలుపార్టీ మారినా ఎలాంటి నష్టం జరుగదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్‌ రాజకీయ కార్యాచరణలో అగ్రనేతలతో పాటు ఇతర నాయకులకూ ప్రాధాన్యం కల్పించడం, స్థానిక సమస్యలపై పోరాటాలు, ప్రభుత్వ విమర్శలకు సమాధానాలు, నిరంతరం ప్రజల్లో ఉండే కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ద్వితీయస్థాయి నేతలను యాక్టీవ్ చేస్తే పార్టీ పటిష్టంగా తయారవుతుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే డేంజర్!

Tags

Related News

ఢిల్లీని మింగేస్తున్న అదృశ్య మృత్యువు.. గాలి పీల్చినా విషమే.. అసలు ఏమైంది?

పల్లె పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్.. రూ. 3,189 కోట్లతో తెలంగాణలో ‘డిజిటల్ విప్లవం’!

జీహెచ్‌ఎంసీ అడ్వర్టైజ్‌మెంట్‌లో కోట్ల కుంభకోణం.. పట్టించుకోని అధికారులు!

ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి? దేశవ్యాప్తంగా ఆయన పేరే ఎందుకు మారుమోగుతోంది?

హైదరాబాద్‌కు జలగండం.. ఈ వాటర్ ఎమర్జెన్సీకి కారణమేంటి?

‘సర్’ పై వ్యూహాత్మక మౌనం ! బీఆర్‌ఎస్ సైలెంట్ మోడ్‌..! ఆ మౌనం వెనుక మతలబేమిటీ…? పైగా ప్రతిపక్షంపైనే విమర్శల దాడి!

బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్.. ఇకపై అలా చేస్తే జైలుకే..?

Big Stories

Advertisement
×