Sravanthi Chokarapu (Image credit: Instagram)
ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

Sravanthi Chokarapu (Image credit: Instagram)
ముఖ్యంగా జబర్దస్త్ వంటి కామెడీ షోలలో సందడి చేసిన ఈమె.. ఎక్కువగా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Sravanthi Chokarapu (Image credit: Instagram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చీర కట్టులో అభిమానులను అలరించే ఈమె తాజాగా మరొకసారి మరో శారీలో మెరిసిపోయింది.

Sravanthi Chokarapu (Image credit: Instagram)
యాష్ కలర్ చీర కట్టుకొని భిన్నమైన ఫోటోలకు ఫోజులిస్తూ కిల్లింగ్ లుక్స్ తో.. ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం స్రవంతి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Sravanthi Chokarapu (Image credit: Instagram)
మరొకవైపు స్రవంతికి రూ.20 కోట్ల విల్లా ఉంది హైదరాబాదులో అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Sravanthi Chokarapu (Image credit: Instagram)
దీనిపైస్పందించిన ఆమె రూ.20 కోట్లు కాదు కదా కనీసం రెండు కోట్ల విలువ చేసే విల్లా కూడా లేదు. త్వరలోనే ఆ ఇంటి కలను నెరవేర్చుకుంటాను అని కూడా తెలిపినట్లు సమాచారం.