E-Paper
Advertisement

రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!
Advertisement

తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్న త‌రుణంలో కేసీఆర్ టీఆరెస్ అనే పార్టీ పెట్టాడు. ఆయ‌న పార్టీ స్థాపించిన నాడు వెనుక పిడికెడు మందే వ‌చ్చారు. అప్పుడు ఆయ‌న ప్ర‌సంగాల్లోపంచులు బాగా ఆక‌ట్టుకునేవి. భావోద్వేగాల‌తో కూడిన ఆయ‌న మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌కు తాకేవి. ఇంకా జ‌నంలో త‌న‌పై, త‌న పార్టీపై న‌మ్మ‌కం క‌లిగించేందుకు ఆయ‌న‌.. తెలంగాణ తెచ్చేదాకా మ‌డ‌మ తిప్ప‌ను.. మాట త‌ప్పితే న‌న్ను రాళ్ల‌తో కొట్టి చంపండ‌నే ఉద్వేగ‌భ‌రిత‌మైన పిలుపునిస్తేండేవాడు.ఇది మ‌రింత‌గా జ‌నాల్లోకి చొచ్చుకుపోయిందానాడు.

దీంతో కేసీఆర్ మీద న‌మ్మ‌కం ఏర్ప‌డ‌టంతో పాటు ఉద్య‌మానికి ఆయ‌న పార్టీ ఊతంగా నిలిచింది. ఇన్నేండ్ల త‌రువాత మ‌ళ్లీ అవే మాట‌లు వినిపించాయి. కేసీఆర్ త‌న‌య‌.. టీఆరెస్ చీఫ్ క‌విత నోటి వెంట‌. త‌న కొత్త పార్టీ ఏర్పాటు త‌రువాత పాంచ‌జ‌న్యం పేరుతో ఆమె ప్ర‌క‌టించిన కీల‌క‌మైన ఐదు హామీల్లో రెండింటిపైన ఆమె మాట్లాడే స‌మ‌యంలో భావోద్వేగానికి గుర‌య్యారు ఇవాళ‌. ప‌దే ప‌దే మీట్ ది ప్రెస్‌లో విలేక‌రులు ఈ పాంచ‌జ‌న్యం ప‌థ‌కాల్లో విద్య , వైద్యంపై ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌ల‌డిగారు. ఈ రెండు ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. ప్ర‌భుత్వ ఆదాయం ఎక్క‌డ స‌రిపోతుంది? అస‌లు ఇవి అమ‌లు చేస్తారా? సాధ్య‌మ‌వుతాయా? అని అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఒక‌టే స‌మాధాన‌మిచ్చారు.

Advertisement

విద్య‌, వైద్యం అంద‌రికీ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఒక్క రూపాయి భారం కాకుండా ఉండేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రూపొందించ‌న‌వ‌ని. తాము అధికారంలోకి రాగానే వీటికి అమలు చేసి చూపెడ‌తామ‌న్నారు. లేదంటే గ‌న్‌పార్క్ వ‌ద్ద న‌న్ను క‌ట్టేసి రాళ్ల‌తో కొట్టండ‌ని ఆమె పిలుపునివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. ఆమె ఇంత సీరియ‌స్ కామెంట్ చేస్తుంద‌ని ఎవరూ అనుకోలేదు. వాస్త‌వానికి ఆ మాట ఆట‌విక కాలం నాటిది. అప్పుడు ఆగ్ర‌హాలు అట్లుండేవి అన్యాయం జ‌రిగితే వేసే శిక్ష‌లు అంత హింసాత్మ‌కంగా ఉండేవి. కానీ అప్ప‌టి తెలంగాణ ఉద్య‌మ ప‌రిస్థితుల్లో కేసీఆర్‌కు బాగా సెట్ అయ్యిందా కామెంట్‌. కానీ క‌విత ఇప్పుడు ఎందుకు ఈ మాట అన్నారు.? ఎందుకు అనాల్సి వ‌చ్చింది..? అనే అంశం చ‌ర్చ‌కు వ‌స్తున్న‌ది. పాంచ‌జ‌న్యంలో మూడు అంశాల్లో ఈ రెండే కీల‌కంగా, ఖ‌ర్చుతో కూడుకున్న‌విగా ఉన్నాయి.

ప్ర‌తీ పేద‌వాడు త‌న ఆదాయంలో విద్య‌, వైద్యం కోసం 60 శాతం కేటాయిస్తార‌నేది ఆమె చేసిన అధ్య‌య‌నం. వీటిని అంత‌టా ఫ్రీ చేస్తే.. ఆ ఖ‌ర్చు మిగిలిపోయి ఆదాయంగా మారుతుంది.. క‌దా ! అనేది ఆమె భావ‌న‌. కానీ ఇవి అమ‌లు సాధ్య‌మే కాద‌నే రీతిలో ప్ర‌చారం జ‌రుగుత‌తోంది. చివ‌ర‌కు మీడియా కూడా ప‌దే ప‌దే ఈ రెండు సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చిప‌చ‌ర్చ‌లకు దిగింది. జ‌నాల్లో త‌న పాంచ‌జ‌న్యంపై విశ్వాసం ప్రోదీ చేసే క్ర‌మంలో ఆమె త‌న తండ్రి వాడిన మాట‌నే.. రాళ్ల‌తో కొట్టి చంపండ‌నే మాట వ్యూహాత్మ‌కంగా వాడిన‌ట్టు తెలుస్తోంది. ఎంత‌టి క‌మిట్‌మెంట్ ఉంటే ఇంత పెద్ద మాట మాట్లాడ‌తారు? అనే భావ‌న వ‌స్తుంది జ‌నాల‌కు కూడా. ఆనాడు కేసీఆర్ .. తెలంగాణ సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌న క‌మిట్‌మెంట్‌ను నిరూపించుకునేందుకు ఈ మాట‌ల‌న్నారు.

Advertisement

ఇప్పుడు క‌విత‌… త‌న అనుకున్న స‌ర్వోద‌య తెలంగాణ‌లో స‌బ్బండ వ‌ర్ణాలు బాగుప‌డాల‌నే ల‌క్ష్యంతో ఎంతో క‌మిట్‌మెంట్‌తో అధ్యయ‌నం చేసి మ‌రీ ఈ ప‌థ‌కాలు పెట్టిన‌ట్టుగా ఆమె నిరూపించుకునే క్ర‌మంలో ఈ కామెంట్స్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. మొత్తానికి ఆమె కేసీఆర్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తున్నారు. ఆయ‌న జ‌నంలోకి వెళ్లే క్ర‌మంలో స‌క్సెస్‌గా అడుగులు ప‌డిన జాడ‌ల‌ను ఆమె వ‌డిసి ప‌డుతున్నారు. రాజ‌కీయ వార‌సురాలిగా త‌నే క‌రెక్టు అనే విధంగా ఆమె జ‌నాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చేలా చేయ‌గ‌లుగుతున్నారు.

Related News

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

అంతుచిక్క‌ని అర్వింద్ అంతరంగం! అనుకున్న‌ది చేస్తాడు.. చెప్పాల్సింది చెప్పేస్తాడు…లైన్ దాటి!

కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !

రెడ్‌బుక్ బెదిరింపులు వ‌చ్చు..! ప్లీజ్ మా ఏపీకి రండని బ‌తిమాల‌డ‌మూ వ‌చ్చు..!

ఆ మౌనం రెచ్చగొడుతుందా? ఆ మౌనాన్ని రెచ్చగొట్టేందుకే ఈ మాటలా?

Big Stories

Advertisement
×