E-Paper
Advertisement

Pawan Kalyan: కుటుంబం అంటే ఇది.. ఆప్యాయత అంటే ఇది

Pawan Kalyan: కుటుంబం అంటే ఇది..  ఆప్యాయత అంటే ఇది
Advertisement

Pawan Kalyan: కొణిదెల ఇంట సంబురాలు అంబరాన్ని అంటాయి. ఏపీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన జనసేనాని  పవన్ కళ్యాణ్ ను కొణిదెల కుటుంబం ఘనంగా ఆహ్వానించింది.

Advertisement

NDA ను ఢిల్లీలో కలిసి వచ్చిన పవన్ డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నాడు. పవన్ గెలించినందుకు ఆయన చేత కేక్ కట్ చేసి చిరంజీవి కుటుంబం శుభాకాంక్షలు తెలిపింది.

Advertisement

పవన్ ను పూల వర్షంతో ఘనంగా కొణిదెల కుటుంబం ఆహ్వానించింది. ఈ ఘన స్వాగతానికి పవన్ ఎంతో ఆశ్చర్యపోయాడు.

ఇక తల్లి సమానురాలైన వదిన సురేఖ.. పెద్ద కొడుకు లాంటి పవన్ ను కౌగిలించుకొని అఖండ విజయానికి శుభాకాంక్షలు తెలిపింది. పవన్ సైతం సురేఖను హత్తుకొని తన ప్రేమను చూపించాడు.

మెగా కుటుంబం మొత్తం పవన్ చేత కేక్ కట్ చేయించింది. రామ్ చరణ్, ఉపాసన తో పాటు మెగా హీరోలు, మనవాళ్ళు, మనవరాళ్లు అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ముఖ్యంగా పవన్ తల్లి అంజనా దేవి ఆశీర్వాదాలు అందుకున్నాడు. కొడుకు గెలుపు చూసి ఆమె ఎంతో ఆనందపడింది. పవన్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపింది.

పవన్ కు తల్లి అంజనా దేవి గుమ్మడికాయతో దిష్టి తీసి లోపలి ఆహ్వానించింది.

మెగాస్టార్ చిరంజీవి.. తమ్ముడు పవన్ అఖండ విజయానికి ఉప్పొంగిపోయాడు. పూలమాలతో ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపాడు.

రామ్ చరణ్.. పవన్ దంపతులకు పుష్ప గుచ్చాన్ని ఇచ్చి వారి ఆశీస్సులు అందుకున్నాడు.

 

సురేఖ.. పవన్ దంపతులకు, కొడుకు అకీరాకు ఎర్రనీళ్లతో దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది.

ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. కుటుంబం అంటే ఇది.. ఆప్యాయత అంటే ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఒక్కడి విజయాన్ని కుటుంబం మొత్తం సెలబ్రేట్ చేయడం.. తామే ఎన్నికల్లో గెలిచినంత సంబురాలు చేసుకోవడం.. ఇది అసలుసిసలైన అనుబంధం అని చెప్పుకొస్తున్నారు.

చిన్నతనం నుంచి అన్న చెప్పినట్లు నడుచుకుంటూ.. ఇప్పుడు బయటకు వచ్చి  ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని.. విజయగర్వంతో అన్న ముందు నిలబడినా.. అదంతా అన్న నేర్పిందే అన్నట్లు.. మోకాళ్లు వచ్చి చిరు కాళ్లకు నమస్కారం చేసి.. ఆశీస్సులు తీసుకున్న జనసేనాని.. నీ సంస్కారానికి హ్యాట్సాఫ్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×