Varalaxmi – Nicholai Sachdev Pre Wedding: కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి సందడి మొదలైంది.
వరలక్ష్మి శరత్‌కుమార్- నికోలాయ్ సచ్‌దేవ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జూన్ 30న ఓ హోటల్‌లో మెహందీ వేడుకతో ప్రారంభమయ్యాయి.
ప్రీవెడ్డింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ వేడుకలో సంపంగి కలర్ లెహెంగాలో మెరిసింది. ఒక ఫొటోలో తన భర్తను ఆలింగనం చేసుకుంటూ కనిపించారు.
వీరిద్దరి వివాహం జులై2న ముంబైలో జరగనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవలె వరలక్ష్మి ఫామిలీ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పెళ్లికి ఆహ్వానించిన సంగతీ తెలిసిందే..
కోలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలను శుభలేక అందించి తమ వివాహానికి రమ్మని కోరారు.
ఇక ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే.. శరత్ కుమార్ కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి క్రాక్, తదితర సినిమాల్లో నెగటివ్ రోల్ చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
?utm_source=ig_embed&ig_rid=7c2ea166-86a6-44d0-b3f9-0bab04669c62">