E-Paper
Advertisement

రెడ్‌బుక్ బెదిరింపులు వ‌చ్చు..! ప్లీజ్ మా ఏపీకి రండని బ‌తిమాల‌డ‌మూ వ‌చ్చు..!

రెడ్‌బుక్ బెదిరింపులు వ‌చ్చు..! ప్లీజ్ మా ఏపీకి రండని బ‌తిమాల‌డ‌మూ వ‌చ్చు..!
Advertisement

ప‌వ‌న్‌ను, లోకేశ్‌ను పోల్చి చూస్తే చాలా విష‌య‌ల్లో లోకేశ్ రాజ‌కీయంగా ప‌రిణ‌తి సాధిస్తూ వ‌స్తున్నాడు. ఒక‌ప్పుడు ప‌ప్పు అని విప‌రీత‌మైన ట్రోల్‌కు గురైన నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది లోకేశే. ఆయ‌న ఆహార్యం, మాట తీరు .. మీమ‌ర్స్‌కు జోకులు వేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డేవి. తీయ‌గుంది.. అని లోకేశ్ అనే ఓ మాట‌ను..విప‌రీతంగా ట్రోల్ చేశారు.

వాస్త‌వానికి ఆయ‌నకు తెలుగు భాష‌పై ప‌ట్టు లేకుండె. విదేశాల్లో ఉన్న‌త విద్య‌లు అభ్య‌సించి వ‌చ్చిన లోకేశ్ మాతృభాష మీద ప‌ట్టు ఉండేది కాదు. ఆయ‌న శ‌రీర‌త‌త్వం కూడా ఊబ‌కాయంగా ఉండ‌టం.. దానికి తోడు తెలుగు మాట్లాడే స‌మ‌యంలో ఆయ‌న త‌డ‌బ‌డే ప‌దాలు.. ప్ర‌తిప‌క్షాల‌కు, సోష‌ల్ మీడియాకు పావుగా మారాడు.

Advertisement

ఈ విష‌యాల‌ను ఆయ‌న తాజాగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకున్నాడు కూడా. ఇప్పుడు మ‌ళ్లీ లోకేశ్ వార్త‌ల్లో కేంద్ర బిందువ‌య్యాడు. మొన్న‌టికి మొన్న… వైఎస్సార్ సీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొడుకు .. త‌న బైక్‌తో ఒక‌రిని ఢీ కొట్ట‌డం.. అత‌ను చ‌నిపోయిన ఉదంతంపై జ‌గ‌న్ మాట్లాడిన తీరును ఎండ‌గ‌ట్టేందుకు తెలంగాణ‌లో బండి సంజ‌య్ కొడుకు పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఉదాహ‌ర‌ణగా తీసుకుని ఇరికించే ప్ర‌త‌య్నం చేశాడు.

ఇది కాదు ముచ్చ‌ట‌.. ఇంత‌క‌న్నా పెద్ద విష‌యం.. అమ‌ర రాజ కంపెనీ చైర్మ‌న్ గ‌ల్లా జ‌య‌దేవ్ గురించి మాట్లాడిన తీరు. టీడీపీ ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్ కంపెనీల‌ను వేధించి, కేసులు పెట్టి అవి మూత‌ప‌డేలా చేసి.. దాన్ని ఏపీ నుంచి త‌రిమేశాడు జ‌గ‌న్‌. ఇప్పుడు ఆ కంపెనీ తెలంగాణ‌కు వ‌చ్చింది. తాజాగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దివిటిప‌ల్లిలో క‌ష్ట‌మ‌ర్ క్వాలిటీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మీటింగుకు వ‌చ్చిన సంద‌ర్భంగా లోకేశ్ అదే వేదిక‌గా గ‌ల్లా జ‌య‌దేవ్ క్ష‌మించ‌మ‌ని కోర‌డ‌మే కాదు.. మా ఏపీకి రావాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది.

Advertisement

ప్ర‌పంచ స్థాయి గుర్తింపు పొందిన ఈ కంపెనీ త‌మ ప్రాంతాన్ని వీడిపోవ‌డం ప‌ట్ల ఓ యువ‌నేత‌గా, సీఎం త‌న‌యుడిగా లోకేశ్ వేద‌న స‌బ‌బైన‌దే. రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ క‌క్ష‌ల‌కు ఓ మంచి కంపెనీని పోగొట్టుకోవ‌డం, ఈ ప‌రిణామం ద్వారా రాష్ట్రం నష్ట‌పోవ‌డాన్ని కూడా ఆయ‌న క్ష‌మాప‌ణ‌, అభ్య‌ర్థ‌న ద్వారా తెలియ‌జేశాడు.

రెడ్‌బుక్ శిక్ష‌లు తప్ప‌వు.. మీరు త‌ప్పించుకోలేర‌ని ప్ర‌తిప‌క్షాన్ని హెచ్చ‌రించిన ఆ నోటితోనే .. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే నేత‌గా చేతులు జోడించి వినయంగా క్ష‌మాప‌ణ కోరి.. తిరిగి మ‌ళ్లీ త‌మ సొంతింటికి రావాల్సిందిగా ఆయ‌న అభ్య‌ర్థించిన తీరు.. ఈ రెండు ఆయ‌నలోని భిన్న పార్శాల‌ను తెలియజేశాయి.

నేను తండ్రిలా సాఫ్ట్ కాదు.. ఎవడినీ వ‌ద‌లా..! అని వార్నింగ్ ఇవ్వ‌డ‌మూ అత‌నికి తెలుసు. రాష్ట్రానికి ఏం కావాలి..? ఎలాగైనా అక్క‌డి ప్ర‌జ‌ల‌కు మేలు చేసేక్ర‌మంలో ఏ విధంగా అభ్యర్థించాలో కూడా అత‌నికి తెలుసు.. అంటున్నారు. ఎక్క‌డ త‌గ్గాలో.. ఎక్క‌డ నెగ్గాలో తెలిసిన వాడంటే ఇదేనేమో మ‌రి!

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×