E-Paper
Advertisement

న‌వ్వుతూ.. వెక్కిరిస్తూ… ! ప్రియాంక ప్ర‌సంగానికి పార్ల‌మెంటు ఫిదా…

న‌వ్వుతూ.. వెక్కిరిస్తూ… !  ప్రియాంక ప్ర‌సంగానికి పార్ల‌మెంటు ఫిదా…
Advertisement

ఆమె ప్ర‌సంగం…కూల్‌గా.. న‌వ్వుతూ.. సాగింది. పిల్ల‌ల‌కు క్లాసులు చెప్పిన‌ట్టు… అల్ల‌రి పిల్ల‌ల‌కు మ‌ధ్య‌తో బెత్తం తీసుకుని వాయించిన‌ట్టు.. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు తొడ‌పాశం పెట్టి సుతిమెత్త‌గా మంద‌లించిన‌ట్టు..! కానీ ఆమె ఏం చెప్పినా.. బుద్దిగానే విన్నారా పిల్ల‌లు. తిట్టేది మ‌మ్మ‌ల్నే అని తెలిసినా న‌వ్వుకున్నారు కూడా. ఆ పొడ‌గ్త‌ల వెనుక వెట‌కారం సూటిగా తాకుతున్నా.. కోపం తెప్పించ‌లేదు వారికి. ఆమె స‌మ‌య‌స్పూర్తిని అలా చూస్తూండిపోయారు. ఆ చ‌మ‌త్కార‌పు మాట‌ల‌ను అలా వింటూ ఉండిపోయారు.

ఆ మాట‌లు ఆవేశంగా కాకుండా ఆలోచింప‌జేసేలా ఉన్నాయి. ఆ ప్ర‌సంగంలో ప్ర‌శాంత‌త ఉంది. ఎంతో ఓపిక క‌నిపించింది. ఆమె ప్ర‌తీ ప‌లుకులో జ‌నం మేలు కోరే ప‌డే త‌ప‌న ఉంది. తెల్ల‌టి కాగితంలా ఉన్న ఆమె మోము స్వ‌చ్చంగా త‌న భావాల‌ను వ్య‌క్తీక‌రించింది. మ‌ర్మం లేదు. మ‌త‌ల‌బూ లేదు. ఆ వ్యాఖ్య‌ల వెనుక ఎంతో ప‌రిశ్ర‌మ ఉంది. త‌న పిల్ల‌ల‌ ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌రిత‌పించే అమ్మ మ‌నసే క‌నిపించింది. ప్ర‌తి ఒక్క‌రికీ.

Advertisement

ఇదంతా ప్రియాంక గాంధీ గురించే. నిజంగా చాలా మంది ఆమె ప్ర‌సంగం విని ఉండ‌రు. కానీ వింటే మాత్రం ఫిదా అవ‌డం ఖాయం. పొలిటిక‌ల్ స్పీచులు ఎన్నో వినుంటారు. ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కుల వాగ్ధాటినీ క‌ని ఉంటారు. కానీ ప్రియాంక స్టైల్ చాలా భిన్నంగా ఉంది. పేప‌ర్ రాసుకొచ్చిందనుకున్నారు. కానీ ఆమె స‌మ‌య‌స్పూర్తితో సంద‌ర్భానుసారం వేసే సెటైర్ల‌కు ఉక్కిరిబిక్కిర‌య్యారు. న‌వ్వుతూనే …. వెక్కిరించిన విధానానికి అచ్చెరువొందారు. త‌ప్పుల‌నెత్తి చూపేట‌ప్పుడు సూటిగా ఆమె వేసిన మాట‌ల బాణాల‌ను త‌ప్పించుకోలేక ముప్పుతిప్ప‌లు ప‌డ్డారు. నాట‌కీయ‌త‌ను బ‌య‌ట‌పెట్టి .. నిజ స్వ‌రూపం ఇద‌ని తేల్చిన‌ప్పుడు త‌మ‌ను బ‌రిబాత‌ల నిలిపిన‌ట్టు సిగ్గుప‌డ్డారు. మేక‌వ‌న్నె పులి తోలు తీసిన‌ట్టుగా చ‌రిత్ర ఆన‌వాళ్లు గుర్తు చేస్తున్న‌ప్పుడు త‌లెక్క‌డ పెట్టుకోవాలో తెలియ‌క తిక‌మ‌క‌పడ్డారు.

బీసీల గురించి మోదీ చుల‌క‌న‌గా, అదో టెక్నిక‌ల్ ఇష్యూగా అభివ‌ర్ణించిన విధానాన్ని ఎత్తి చూపే క్ర‌మంలో ఆమె ఆ వ‌ర్గాలకు బాస‌ట‌గా నిలిచారు. బీసీల శ‌క్తి ఏ పాటితో తెలిస్తే మోడీ త‌ట్టుకోలేడు.. అందుకే ఆయ‌న ఆ సంఖ్య‌ను తెలుసుకోవాల‌నుకోవ‌డం లేదు.. లోకానికి తెలియ‌జెప్పాల‌నుకోవ‌డం లేద‌ని… ఆమె కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం ఆ స‌మాజం ప‌ట్ల ఉన్న క‌మిట్‌మెంట్‌ను సూచించింది. మ‌హిళా బిల్లును ఎవ‌రో అడ్డుకుంటున్నార‌ని, ఎవ‌రూ అడ్డుకోలేర‌ని మోడీ అన్న మాట‌ల‌ను ఆమె వెట‌కారం రంగ‌రించి .. ఎవ‌రూ అడ్డుకోలేదు.. మీరే దాన్ని అడ్డుకున్న‌ది..! అని సింపిల్‌గా చెప్పేసినా.. కారం జ‌ల్లిన‌ట్టుగానే మండింది.

Advertisement

అది మ‌హిళ‌ల‌కు ద‌క్కాల్సిన హ‌క్కు.. వాటా..! ఎవ‌రి మెహ‌ర్బానీ కాద‌న్న ఆమె.. ఏ పురుషుడు ఎట్లాంటాడో.. మ‌హిళల మేలు కోరేవారెవ‌రో వాళ్లు ఈజీగా ప‌సిగ‌ట్టేయ‌గ‌ల‌ర‌ని స్ప‌ష్టం చేయ‌డం న‌వ్వుల‌ను పూయించినా.. లోతైన త‌న మ‌ర్మాన్ని తెలియ‌జేసింది. నెహ్రూ పేరు చెబితే నొచ్చుకుంటారు గానీ, మ‌హిళా బిల్లు రూప క‌ల్ప‌న‌లో నెహ్రూను ఎవ‌రూ తీసేయ‌లేర‌ని గుర్తు చేసిన విధాన‌మూ బాగుంది. ఇది ఇప్ప‌టికే అమ‌లు చేయాల్సి ఉండ‌గా.. చేయ‌కుండా.. ఇప్పుడు హ‌డావుడిగా ఎందుకు చేస్తున్న‌ట్టో.. అని నిల‌దీసిన వైన‌మూ ఆక‌ట్టుకున్న‌ది.

లేటు అయ్యింది ఎట్లాగూ.. జ‌న‌గ‌ణ‌న పూర్తి చేసి చేయొచ్చుగా అని ప‌లికిన హితోక్తి మోడి మ‌ర్మాన్ని బ‌య‌ట‌పెట్టింది. రాహుల్ అంటే ప‌ట్టింపులేన‌ట్టుగా స‌భ‌లో ప్ర‌వ‌ర్తించినా.. ఆయ‌న సూచించిన విష‌యాల‌ను చాలా కేర్‌గానే ప‌ట్టించుకుంటార‌ని.. రాహుల్‌గాంధీ అంటే మోడీకి భ‌యం ఉంద‌నే విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పారామె. ఆమె ప్ర‌సంగం ఆక‌ట్టుకున్న‌ది. స్వ‌పక్షంతో పాటు అధికార పక్షాన్ని కూడా.

Related News

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

Big Stories

Advertisement
×