E-Paper
Advertisement

Congress : బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..పట్టుబిగించిన కాంగ్రెస్!

Congress : బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..పట్టుబిగించిన కాంగ్రెస్!
Advertisement

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అక్రమాలు, అవినీతిని వెలికితీసేందుకు గాను సీబీఐ విచారణకు రంగం సిద్ధం చేసింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికి తోడు రాష్ట్ర విద్యుత్ అవసరాల దృష్ట్యా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను ప్రారంభించింది. అయితే, విద్యుత్ కోసం నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో పలు అక్రమాలు, అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ మేరకు అందులోని లెక్కలు తేల్చేందుకు సీబీఐని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నది.

అధిక చెల్లింపులు..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ డిస్కమ్స్ తేలని సమయంలో రాష్ట్రంలో కరెంట్ కొరత రాకుండా ఉండేందుకు ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్నది.అందుకోసం యూనిట్ విద్యుత్‌కు అధికచెల్లింపులు చేసినట్టు కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. దీనికి తోడు అక్కడి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఇంకా విద్యుత్ అవసరాలు తీరలేదని గమనించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో భద్రాద్రి, యాదగిరి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయించింది.

ఎన్టీపీసీ నుంచి..

Advertisement

దీనికి తోడు రాష్ట్రంలో రామగుండం ఎన్టీపీసీ విస్తరణ, జైపూర్ పవర్ ప్లాంట్ విస్తరణకు కేంద్రంతో ఒప్పందం.. భూమి కేటాయింపులు, నిధులు కేటాయింపులు జరిగాయి. అయితే, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలన ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇష్టానుసారంగా రుణాలు తేవడం వలన ప్రస్తుత ప్రభుత్వానికి అప్పులు చెల్లించడం భారంగా మారింది. దీనికి తోడు టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంట్స్ నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు ఓవర్ కోట్ చేసి దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈ మేరకు వాటిపై సమగ్ర విచారణకు సీబీఐ సాయం కోరేందుకు సిద్ధమైంది.

ఇంటర్ బోర్డు బిగ్ అనౌన్స్ మెంట్.. ఈ తేదీలోగా అడ్మిషన్ తీసుకోకపోతే సీటు కష్టమే..?

Advertisement

ఇప్పటికే కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసు కేసు, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసుల్లో సిట్ విచారణ జరుగుతోంది. పలు విచారణలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వయిరీ చేపడితే మరోసారి బీఆర్ఎస్ నేతలు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాడు విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన వారంతా విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది.మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహా పలువురు అధికారులు సైతం సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానం చెపాల్సి ఉంటుంది. ఈ విషయంలో అవసరమైతే కేసీఆర్‌ను సైతం అధికారులు విచారిస్తారని తెలుస్తోంది.కాంగ్రెస్ మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ సీనియర్లకు ఏం తోచడం లేదని తెలుస్తోంది. కాగా, దీనిపై ఇప్పటివరకు గులాబీ నేతలు స్పందించకపోవడం గమనార్హం.

Related News

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

Big Stories

Advertisement
×