E-Paper
Advertisement

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..
Advertisement

ఒక్కొక్క‌రిని కాదు షేర్‌ఖాన్‌.. వంద మందిని ఒకేసారి పంపించు..!అని భైర‌వ .. మ‌గ‌ధీర‌లో షేర్‌ఖాన్‌కు స‌వాల్ విసిరితే.. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే సంప‌త్‌.. కేటీఆర్‌కు స‌వాల్ విసిరాడు. ఏమ‌ని..? ఒక్క‌రిని కాదు.. ఏకంగా డెబ్బైవేల మంది ఉద్యోగార్థుల‌ను ఎల్‌బీ నగ‌ర్ స్టేడియంకు తీసుకువ‌స్తాన‌న్నాడు.

లెక్క ఎక్కువైనా ప‌ర్లేదు.. ఒక్క‌రు త‌గ్గ‌కుండా వంద మందిని పంపించు.. అని అక్క‌డ సినిమాలో డైలాగు.. ఇక్క‌డ డైబ్బై వేల మందికి ఒక్క‌రు త‌గ్గినా నా త‌ల‌నరుక్కుంటా..! సంప‌త్ డైలాగ్‌. ఇదంతా ఎందుకంటే.. ఇవాళ యువ సంగ్రామం పేరుతో బీఆరెస్ చేప‌ట్టిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడిన మాట‌ల‌కు కాంగ్రెస్ నుంచి స్పంద‌న‌. లీగ‌ల్‌గా ముందుకు పోకుండా కాళ్ల‌కు అడ్డంకిగా మారారు కాబ‌ట్టే.. డెబ్బైవేల ద‌గ్గ‌ర ఆగింద‌ని, లేదంటే… ఇప్ప‌టికే మ‌రిన్ని ఉద్యోగాలిచ్చేవాళ్ల‌మ‌ని కూడా తెలిపాడాయ‌న‌.

Advertisement

చేసిందంతా చేసి ఇప్పుడు చంపినోడే సంతాప స‌భ పెట్టిన‌ట్టు కేటీఆర్‌.. యువ సంగ్రామ సద‌స్సు పెట్టాడ‌ని విమ‌ర్శించాడు సంప‌త్‌. అంతే కాదు ఈ చెప్పే నీతులేవో ఆ ప‌దేళ్లలో పాటించి ఉంటే ఎంతో మందికి ఉద్యోగాలు వ‌చ్చి ఉండేవ‌న్నాడు. ఆల్రెడీ కేటీఆర్ రాజ‌కీయ స‌న్యాసంలోనే కొన‌సాగుతున్నాడ‌ని, ఇక కొత్త‌గా రాజ‌కీయ స‌న్యాసం చేయాల్సిన ప‌రిస్థితి లేద‌న్నాడు. విష‌య‌మేమింటంటే.. కాంగ్రెస్ ప‌దే ప‌దే చెప్పుకుంటున్న 70వేల ఉద్యోగాల లెక్క‌పై కేటీఆర్ తీవ్రంగా మండిప‌డ్డాడు.

తామిచ్చిన ఉద్యోగాల‌కే నియామ‌క ప‌త్రాలిచ్చి.. అవి కూడా త‌మ ఖాతాలో క‌లుపుకుంటున్నార‌ని.. క‌రెక్టుగా లెక్క తీస్తే.. ఓ ప‌దివేల ఉద్యోగాలు కూడా ఇచ్చి ఉండ‌ర‌ని ఎద్దేవా చేస్తూ స‌భ‌లో మాట్లాడాడు. ఇదే కాంగ్రెస్‌కు విప‌రీత‌మైన కోపాన్ని తెచ్చిపెట్టింది. ఓవైపు .. ఈ స‌భ‌కు పోటీగా.. ధీటుగా.. గాంధీభ‌వ‌న్‌లో బ‌ల్మూరి వెంక‌ట్‌.. తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర పేరుతో ఓ ఫోటో ఎగ్జిబిష‌న్ నిర్వ‌హించాడు.

Advertisement

అప్పుడు ప‌దేళ్ల పాల‌న‌లో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? నిరుద్యోగులు ఎలా ఇబ్బందులు ప‌డ్డారు..? అనే విష‌యాల‌ను చెబుతూనే.. రెండున్న‌రేండ్ల‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్ ఎన్ని వేల ఉద్యోగాలిచ్చింద‌నే విష‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాడు. అయితే ఈ వేదిక‌గా చాలా మంది నిరుద్యోగుల‌తో మాట్లాడించాడు కేటీఆర్‌. వారంతా .. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కాలికి బ‌లపం క‌ట్టుకుని తిరిగామ‌ని అన్నారు. అంటే.. కాంగ్రెస్‌ను గెలిపించేందుకు అంత‌గా క‌ష్ట‌ప‌డిన ఆ నిరుద్యోగులే.. బీఆరెస్‌ను మ‌ళ్లీ గెలిపించాల‌ని అనుకోలేదు.

ఎందుకు? వారికి జాబ్‌ల విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌నే క‌దా! ఓ ర‌కంగా ఆ వేదిక మీద త‌మ‌ను తాము తిట్టించుకున్న‌ట్టుగా కూడా అయ్యింద‌నే చ‌ర్చ జ‌రిగింది. మొత్తానికి ఈ వివాదాన్ని బీఆరెస్ కూడా పెంచి పెద్ద‌ది చేయాల‌నే చూస్తున్న‌ది. ఎందుకంటే..నిరుద్యోగుల్లో కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ట్ల విప‌రీత‌మైన కోపం ఉంది. ఇప్పుడు వారు బీఆరెస్‌ను ఎంత తిట్టినా.. నిరుద్యోగులు మాత్రం బీఆరెస్ ప‌క్షానే ఉండేలా ఉన్నారు. ఎందుకంటే ప్ర‌శ్నించ‌డం, నిలదీయ‌డం ద్వారా త‌మ‌కు ఆ రెండున్న‌రేండ్ల‌లోనైనా.. స‌ర్కార్ జాబ్‌ల‌కు నోటిఫికేష‌న్లు వేస్తుంద‌ని నిరుద్యోగులు భావిస్తున్నారు.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×