E-Paper
Advertisement

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!
Advertisement

దెబ్బ అదుర్స్ క‌దూ! అమ‌రావ‌తి రాజ‌ధానిపై ఎప్పుడూ ఏదో విధంగా వివాదాలు రేపి అది త‌న రాజ‌కీయానికి ఉప‌యోగ‌పడుతుంద‌నే భ్ర‌మ‌లో ఉన్న జ‌గ‌న్‌కు దిమ్మ‌దిరిగే ఆన్స‌రిచ్చాడు చంద్ర‌బాబు. మావిగ‌న్ అనే వింత‌పేరును తెర‌పైకి తెచ్చి.. ఆ త‌రువాత విజ‌య‌వాడే రాజ‌ధాని అని మ‌రో ప్ర‌క‌ట‌న చేసి… త‌ను మాత్రం విశాఖ‌ప‌ట్టణంలోనే అన్ని తిష్ట వేసుకుని.. ఏం చెబుతున్నాడో అర్థం కాక‌.. జ‌నాల మైండ్ల‌లో ఏదో విధంగా అమ‌రావతి డిస్ట్ర‌ర్బ్ కానుంద‌నే ఓ బీజం వేసే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ స‌క్సెస‌వుతూ వ‌స్తున్నాడు.

110 కి.మీ ప‌రిధిలో మచిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు న‌గ‌రాల‌ను క‌లుపుకుని అభివృద్ధి కారిడార్‌గా చేయాలంటూ .. త‌న‌దైన శైలిలో దానికి మావిగ‌న్ అని పేరు పెట్టాడు. త‌క్కువ మొత్తం నిధుల‌తో వీటిని అభివృద్ది ప‌ర‌చ‌డం ద్వారా అక్క‌డి ప్ర‌జ‌లంద‌రికీ మేలు చేసిన‌ట్ట‌వుతుంద‌ని చెబుతూ వ‌చ్చారు. ఇటీవ‌ల మాట మార్చి విజ‌య‌వాడ అనే పేరును కూడా తెర‌పైకి తెచ్చాడు. దీంతో చాలా మందికి ఓ క్లారిటీ అయితే వ‌చ్చింది. జ‌గ‌న్‌లోనే క్లారిటీ లేద‌ని.

Advertisement

అయోమ‌యంతో త‌మ‌ను అయోమయానికి గురి చేసి.. ఆ అయోమ‌యంలోకి కూట‌మి ప్ర‌భుత్వాన్ని నెట్టేయాల‌ని. తాజాగా చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యం.. ఈ మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌కు మించేలా.. ఆ అయోమ‌య ప్ర‌క‌ట‌న‌ను ముంచేలా ఉంది. బాబు మాస్ట‌ర్ ప్లాన్ ఎలా ఉంటుందో మ‌రోసారి ఈ ఉదంతం ద్వారా తెలియ‌జేసిన‌ట్ట‌య్యింది.

అమ‌రావ‌తి ఎక‌నామిక్ రీజియ‌న్ పేరుతో తొమ్మిది జిల్లాల‌ను ఇందులోకి లాక్కొచ్చారు.. బాబుగారు. ఇది మామూలు విష‌యం కాదు. ఇక దీనికి మించిన త‌రుణోపాయం.. మావిగ‌న్‌కు విరుగుడు ఉండ‌ద‌నే విధంగా మంచి మాస్ట‌ర్ ప్లాన్‌తో బాబు ముందుకు రావ‌డం.. రాజకీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అటు రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్ట‌డంతో పాటు.. తొమ్మిది జిల్లాల.. గోదావ‌రి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప‌ల్నాడు, బాప‌ట్ల‌, ప్ర‌కాశం, నెల్లూరు, తిరుప‌తి..ల‌ను క‌లుపుకుని దాదాపు 45వేల కిలో మీట‌ర్ల ప‌రిధిలో ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం, ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ జిల్లాల‌ను కేంద్రంగా మార్చ‌డం ఈ ఆర్థిక మండ‌లి ల‌క్ష్యం.. !

Advertisement

అమ‌రావ‌తిని ఫైనాన్స్ సిటీగా గుర్తించేలా చేసి.. జ‌స్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీల పేరుతో ఇప్ప‌టికే ఏపీని అన్ని విభాగాల్లో, రంగాల్లో అభివృద్ది చేసేందుకు కూట‌మి స‌ర్కార్ క‌స‌ర‌త్తు చేసి .. ముందుకు సాగుతోంది. అమ‌రావ‌తిని మ‌రింత బ‌ల‌ప‌రుస్తూనే.. చుట్టూ ఉన్న న‌గ‌రాల ప్ర‌జ‌లు నిరాశ చెంద‌కుండా.. ప్ర‌తిప‌క్షం గార‌డీ మాట‌ల‌కు అయోమ‌యానికి గురి కాకుండా ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న‌ట్టుగా చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ అనుభ‌వ‌న్నంతా ఉప‌యోగించి ఈ ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వ‌చ్చార‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతోంది.

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×