E-Paper
Advertisement

Tamil Nadu Politics: సీఎం కాకముందే.. విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న చిన్నపార్టీలు..!

Tamil Nadu Politics: సీఎం కాకముందే.. విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న చిన్నపార్టీలు..!
Advertisement

Tamil Nadu Politics: టీవీకే పార్టీ అధినేత విజయ్ పరిస్థితి చూస్తుంటే ‘దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వలేదు’ అనే సామేత గుర్తుకు వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. డీఎంకే, అన్నా డీఎంకే వంటి దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలను ఓడించి.. టీవీకే పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) రాకపోవడంతో విజయ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొత్తు కుదుర్చుకునేందుకు విజయ్ ప్రయత్నిస్తుంటే చిన్న పార్టీలు.. కొంతెమ్మ కోరికలు కోరుతున్నట్లు తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్‌గా వీసీకే..

టీవీకే అధినేత విజయ్ కు ఇప్పటికే కాంగ్రెస్ (5 స్థానాలు), సీపీఐ (2), సీపీఎం (2) పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయన బలం 117కు చేరింది. అయితే మ్యాజిక్ ఫిగర్ (118) దాటాలంటే విజయ్ కు మరో రెండుస్థానాలు అవసరం. అయితే డీఎంకే, ఏఐడీఎంకే సపోర్ట్ తీసుకోకూడదని భావించిన విజయ్ కు ప్రస్తుతం అమ్మ మక్కల్ మున్నేత్ర కజగం (AMMK), విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) ప్రత్యామ్నాయంగా నిలిచాయి. ఎన్నికల్లో గెలిచిన తమ ఏకైక అభ్యర్థి.. విజయ్ కు మద్దతు ఇవ్వడంలేదంటూ AMMK ప్రకటించింది. దీంతో రెండు సీట్లు గెలుచుకున్న వీసీకే.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారింది. విజయ్ ప్రభుత్వం ఉండాలా? లేదా? అని డిసైడ్ చేసే స్థితిలోకి అది వచ్చింది.

డిప్యూటీ సీఎం పదవి డిమాండ్..!

Advertisement

సాధారణంగా రెండు సీట్లు వచ్చిన పార్టీకి.. ప్రభుత్వ ఏర్పాటులో ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. కానీ.. విజయ్ కు వచ్చిన విచిత్రమైన పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని వీసీకే భావిస్తున్నట్లు సమాచారం. మ్యాజిక్ దాటేందుకు తాను మద్దతు ఇవ్వాలంటే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వీసీకే షరతు పెట్టినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం బలంగా ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేబినేట్ లో మంత్రి పదవిని సైతం ఆ పార్టీ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, చెరో రెండు దక్కించుకున్న సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం మంత్రి పదవి ఇవ్వాలన్న ఒప్పందం మేరకే తమ మద్దతు ప్రకటించాయని ప్రచారం జరుగుతోంది.

Also Read: కైలాసగిరిపై భారీ త్రిశూలం.. ప్రారంభించిన మంత్రులు.. ప్రత్యేకతలు తెలిస్తే షాకే!

ఆ పార్టీలతో సీఎంగా ఉంటారా?

Advertisement

సీఎం కాకముందే ఇన్నేసి గొంతెమ కోరికలు కోరుతున్న చిన్నపార్టీలను నమ్ముకొని విజయ్ ఐదేళ్లు సీఎంగా కొనసాగటం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయా పార్టీల సపోర్ట్ తో ఇప్పటికిప్పుడు అధికారం చేపట్టినా.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. కాబట్టి ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను విజయ్ ఆకర్షించగలిగితే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఎక్కువ మంది సభ్యుల మద్దతుతో విజయ్ ప్రభుత్వం.. ఎలాంటి చిక్కులు లేకుండా ఐదేళ్ల పాటు పరిపాలన సాగించగలదని అంటున్నారు. మెుత్తం మీద చిన్నపార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఐదేళ్లపాటు ఏ విధంగా నెట్టుకువస్తారో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read: సొంత కారు లేదు.. ఇల్లు లేదు.. దేశంలో నిరుపేద సీఎం మమతేనట!

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×