Kailasagiri Trishul: విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగరిలో మరో అధ్భుతం ఆవిష్కృతమైంది. ఏకంగా 65 అడుగుల ఎత్తైన ఢమరుకంతో కూడిన త్రిశూలంను మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ క్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ త్రిశూల్ ప్రాజెక్ట్ పూర్తి కాగా.. దీని నిర్యాణానికి సుమారు రూ.2.5 కోట్లు ఖర్చు చేశారు.
విశాఖ నగరంలో ఎక్కడ నుంచి కైలాసగిరి వైపు చూసిన కనిపించేలా 65 అడుగుల ఎత్తులో ఈ ఢమరుకంతో కూడిన త్రిశుల్ ను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ మరింత ప్రకాశవంతంగా కనిపించేందుకు 100 వాట్స్ కలిగిన 90 ఎల్ఈడి లైట్లను ఈ త్రిశూలానికి అమర్చారు. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 8 నెలల సమయం పట్టింది.
విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్
65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ
రూ. 2.5 కోట్ల వ్యయంతో త్రిశూలం రూపకల్పన
పూణేలోని ప్రత్యేక శిల్పులచే త్రిశూలం రూపొందించిన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ
రాత్రి సమయంలోనూ విద్యుత్ కాంతులీనుతూ ఆకర్షించనున్న త్రిశూలం
A new… pic.twitter.com/2jdYuAmXII
— BIG TV Breaking News (@bigtvtelugu) May 9, 2026
త్రిశూలం ప్రారంభోత్సవం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. టూరిజం సర్క్యూట్స్ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఎప్పుడు సూచిస్తుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కైలాసగిరిపై ఐకానిక్ గా భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కైలాసగిరిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి డీఆపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు నారాయణ తెలిపారు. ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ కోసం వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏడు రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఇప్పటికే మూడు రోడ్లు పూర్తైనట్లు చెప్పారు.
మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం గా ఉన్న ప్రతి సారి విశాఖలో ఏదొకఒక మార్పు తీసుకువస్తున్నారని ప్రశంసించారు. విశాఖ ఉక్కును కాపాడుకున్నామని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నోటిఫికేషన్ సైతం జారీ అయ్యిందని గుర్తుచేశారు. విశాఖ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందన్న ఆయన.. పర్యాటక పరంగానూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కైలాసగిరిపై ఏర్పాటు చేసిన త్రిశూలం ఒక ల్యాండ్ మార్క్ గా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.
Also Read: POCSO Case: తెలంగాణలో సంచలనం.. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. ఎందుకంటే?
కైలాసగిరి పై త్రిసూల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. గాలులు వేగాన్ని తట్టుకొని నిలబడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కైలాసగిరిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తయారు చేయాలని భావిస్తున్నామని.. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ ను సైతం సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ భారీ త్రిశూలంను చూసేందుకు ఎలాంటి ప్రవేశ రుసుము పెట్టడం లేదని.. పర్యాటకులు ఉచితంగానే దీనిని వీక్షించవచ్చని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు.
Also Read: చిక్కుల్లో విజయ్.. టీవీకే పార్టీపై ఫోర్జరీ ఆరోపణలు.. గవర్నర్‌కు AMMK ఫిర్యాదు