E-Paper
Advertisement

విజ‌య్ టీవీకే పార్టీ విజ‌యం.. కొత్త రాజ‌కీయ శ‌క్తుల అనివార్య‌త‌కు సంకేత‌మా?

విజ‌య్ టీవీకే పార్టీ విజ‌యం.. కొత్త రాజ‌కీయ శ‌క్తుల అనివార్య‌త‌కు సంకేత‌మా?
Advertisement

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన టీవీకే పార్టీ అధినేత‌, సినీ హీరో విజ‌య్‌లాగే త‌న‌కూ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఆ రేంజ్‌లో ఉంటుంద‌ని క‌విత ఆశాభావం వ్య‌క్తం చేశారు. మొద‌టి నుంచి ఆమె సీఎం కావాల‌ని ఆకాంక్షిస్తున్నారు. అదే జోష్‌తో పార్టీ పెట్టారు. మొద‌టి నుంచి తాను సీఎంను అవుతాన‌ని క‌చ్చితంగా చెబుతూ వ‌స్తున్నారు. ఇందులో డౌటే లేదు.. నేను క‌చ్చితంగా సీఎం అవుతాను.. అని చెబుతూనే .. ఎప్పుడో ఒక‌సారి అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని ఆత్మ‌విశ్వాసంతో చెబుతున్నారామె. చాలా మంది న‌వుకున్నా.. రాజ‌కీయాల్లో ఈ కామెంట్స్‌ను కొంద‌రు లైట్ తీసుకున్నా.. ఈ విష‌యంలో ఆమె కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.

ఇప్పుడున్న అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆల్ట‌ర్నేట్ పార్టీ త‌న‌దేన‌ని ఆమె మొద‌ట్నుంచి చెప్పుకొస్తున్నారు. వ్యూహంలో భాగంగా ఆమె ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్‌కు గండి కొడుతూ.. ప్ర‌జ‌లు ఆద‌రించిన‌.. కేసీఆర్ విస్మ‌రించిన టీఆరెస్ పేరును త‌న పార్టీకి పెట్టుకోవ‌డంలో స‌క్సెస‌య్యారు. అయితే పేరు పెట్టుకోగానే అంతా అయిపోలేదు. అధికారం దానంట‌త అదే ద‌రికి రాదు. ఆ విష‌యం ఆమెకూ తెలుసు. ఇవాళ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఆమె చేసిన ట్వీట్ సందేశం ఆస‌క్తిగా ఉంది. చ‌ర్చ‌కు తెర తీసింది. ఉన్న పార్టీల‌తో జ‌నం విసుగెత్తిపోయారు. కొత్త పార్టీల వైపు చూస్తున్నారు. ఈ పాల‌న వారిలో తీవ్ర అసంతృప్తి మిగిల్చుతున్న‌ది.

Advertisement

అందుకే కొత్త శ‌క్తులు వ‌స్తే ఎంతో న‌మ్మ‌కంతో వారికి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారీ విధంగా.. అని ఆమె విజ‌య్ గెలుపును.. త‌న కొత్త పార్టీకి ఆపాదించుకున్నారు. త‌న‌కూ తెలంగాణ‌లో ఇలాంటి ఫ‌లితాలే వ‌స్తాయ‌ని, ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేశారు. పాంచ‌జ‌న్యం పేరుతో ఆమె ఇది వ‌ర‌కే ఐదు కీల‌క‌మైన హామీల‌ను ఇచ్చి ఉన్నారు. సాధ్యాసాధ్యాల‌పై అప్పుడే దీనిపై చ‌ర్చ మొద‌లైంది. మాన‌వీయ కోణంలో, త‌ల్లి ప్రేమ స్ప‌ర్శ‌తో కూడిన పాల‌న అందించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని, ఇంత వ‌ర‌కు తెలంగాణ‌లో ఇలా ఆలోచించ‌కే ప‌రిస్థితులు ఇంకా అలానే ఉన్నాయ‌ని ఆమె చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి ఆమె స‌మాంత‌రంగా, ఒక్కో ద‌శ‌లో ముందు వ‌ర‌సులో ఉంటూ వ‌స్తున్నారు.

టీఆరెస్ చీఫ్‌గా.. కేసీఆర్‌కు తానే నిజ‌మైన వార‌సురాలిగా అనిపించుకునే క్ర‌మంలో ఆమె రాజ‌కీయంగా ప‌రిణితినే కాదు.. దూకుడును కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. తాజాగా విజ‌య్ కొత్త పార్టీ ఘ‌న విజ‌యం.. క‌విత టీఆరెస్ పార్టీకి ఊపునిచ్చింద‌నే చెప్పాలి. పార్టీ నిర్మాణం లేకున్నా.. త‌క్కువ‌కాలంలోనే విజ‌య్ రాజ‌కీయ పార్టీ పెట్టి.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. ఇప్పుడు క‌విత‌కు చాలా స‌మ‌యం ఉంది. ప్ర‌జాందోళ‌న‌ల నిర్మాణాలు, పార్టీ క‌మిటీల నిర్మాణం.. త్వ‌ర‌లో రాబోయే ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు.. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. ఇవ‌న్నీ ఆమె ముందున్న స‌వాళ్లు. ఒక్కొక్క‌టిగా వీటిన్నంటినీ ఆమె పూరిస్తూ రావాలి. ఆ అనుభ‌వాల‌తో ఆమె పార్టీని మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తూ ముందుకు పోవాలి.

Advertisement

జ‌నం క‌విత టీఆరెస్‌ను పూర్తిగా ఓన్ చేసుకునే విధంగా ఆమె అడుగులు ప‌డాల్సి ఉంది. మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌న్న క‌విత‌.. సామాజిక తెలంగాణ విష‌యంలో కూడా చాలా స్ప‌ష్ట‌త నిచ్చారు. వీటిని అమ‌లు చేయ‌డమే పెద్ద సాహ‌సం. ఇత‌ర పార్టీలు చేయ‌నది..త‌న కొత్త పార్టీ ద్వారా చేసి చూపెడ‌తానంటున్న క‌విత‌… ఇచ్చిన మాట త‌ప్పితే రాళ్ల‌తో కొట్టి చంపండ‌నే కేసీఆర్ కామెంట్ల‌ను ఈ సంద‌ర్భానికి, తన పార్టీ విధానాల‌కు వినియోగించుకుంటున్నారు. వాస్త‌వానికి, విజ‌య్ పార్టీని కూడా చాలా లైట్‌గా తీసుకున్నారంతా. ఇప్పుడ‌ది నిశ్శ‌బ్ద విప్ల‌వానికి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. మ‌రి క‌విత పార్టీ ఏం చేయ‌నుందో చూడాలి.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×