E-Paper
Advertisement

విజయ్ దెబ్బకి ‘సన్’ టీవీకి స్ట్రోక్… షేర్లు 10 శాతం పతనం

విజయ్ దెబ్బకి ‘సన్’ టీవీకి స్ట్రోక్… షేర్లు 10 శాతం పతనం
Advertisement

Sun TV Shares: సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏడీఎంకే, డీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా దూసుకుపోతుంది. అయితే టీవీకే విజయం ఖరారు కావడంతో.. డీఎంకే ఓటమితో సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్ షేర్లు 9.5% పైగా పడిపోయాయి. ఆగస్టు 2024లో సన్ టీవీ షేర్లు 10% పైగా పడిపోయినప్పటి నుంచి, ఒక్కరోజులో ఇంత భారీగా పడిపోవడం ఇదే తొలిసారి. ఓ దశలో సన్‌టీవీ షేరు విలువ బీఎస్‌ఈలో 9.5 శాతం మేర పతనమై రూ.547.55 వద్ద కనిష్ట ధరను తాకింది. మార్కెట్‌ ముగిసే నాటికి 5.38 శాతం నష్టంతో రూ.573 వద్దకు చేరింది.

సన్ టీవీ షేర్లు పతనం

సన్ టీవీ నెట్‌వర్క్ మారన్ కుటుంబ యాజమాన్యంలో కొనసాగుతోంది. కలనిధి మారన్, దివంగత డీఎంకే అధినేత ఎం. కరుణానిధికి మనవడు. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న గత ఐదేళ్లుగా, సన్ టీవీ షేర్లు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. 2023లో సన్ స్టాక్ 46% లాభపడగా, 2024 (4% పతనం), 2025 (14% పతనం), 2022 (3% పతనం)లలో నష్టాల్లోనే కొనసాగింది. 2021లో సన్ టీవీ స్టాక్ 4% లాభపడింది. హై ట్రేడింగ్ వాల్యూమ్‌ల మధ్య సన్ టీవీ షేర్లు భారీగా పడిపోతున్నాయి. 20 రోజుల్లో సగటున 87,000 షేర్లు, ఇప్పటికే 5.5 లక్షలకు పైగా షేర్లు చేతులు మారాయి.

లీడ్ లో టీవీకే

Advertisement

తాజా ట్రెండ్స్ ప్రకారం, విజయ్ టీవీకే 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 27 స్థానాల్లో విజయం సాధించింది. ఏడీఎంకే కూటమి 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 12 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే 59 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 14 స్థానాల్లో విజయం సాధించింది. సోమవారం సన్ టీవీ షేర్లు 8.7% తగ్గి రూ.551.2 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ స్టాక్ అన్ని కీలక మూవింగ్ యావరేజ్‌ల కంటే దిగువకు చేరింది. రూ.571 వద్ద 200 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే కూడా కిందకు పడిపోయింది.

Also read:   విజయ్ సక్సెస్ వెనుక.. త్రిష మాస్టర్ ప్లాన్ ఉందా? తమిళనాట ఆసక్తికర చర్చ!

లాభాల్లో సూచీలు

Advertisement

మరోవైపు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలు నమోదు చేశాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమై ఓ దశలో దాదాపు 1000 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ లాభపడింది. అనంతరం దాదాపు 700 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12.50 గంటలకు 319 పాయింట్ల లాభంతో 77,269.40 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 24,094 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌,రిలయన్స్‌ స్టాక్స్‌ లాభాల్లో కొనసాగాయి.

Related News

ఇండియాలోనూ ప్లాస్టిక్ నోట్లు.. ప్రస్తుతం ఏయే దేశాల్లో చెలామణిలో ఉన్నాయంటే?

Polymer Currency: త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..ఆర్‌బీఐ సన్నాహాలు!

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Big Stories

Advertisement
×