E-Paper
Advertisement

రామ‌న్న అంద‌రికీ మంత్రుల శాఖ‌లు పంచుతుంటే.. సీన‌న్న సీఎం సీటుకే ఎస‌రువెట్టే!

రామ‌న్న అంద‌రికీ మంత్రుల శాఖ‌లు పంచుతుంటే.. సీన‌న్న సీఎం సీటుకే ఎస‌రువెట్టే!
Advertisement

బీఆరెస్‌లో ఇదో పెద్ద జోక్ అయిపోయింద‌బ్బా! రామ‌న్న‌నేమో త‌నే సీఎం అయిపోయిన‌ట్టు.. త‌న కేబినెట్‌లో ఎవ‌రెవ‌రికి ఏమేం శాఖ‌లివ్వాలో ప‌లారం పంచిన‌ట్టు పంచేస్తున్నాడు. ఆరెస్ ప్ర‌వీణ్‌కుమార్‌కు హోం శాఖ ఇచ్చేశాడు. బ‌హిరంగంగా ప్ర‌క‌టించేశాడు కూడా. ఇక ఎప్పుడూ త‌న‌తోనే క‌లిసిమెలిసి తిరిగే జాన్‌జ‌బ్బా అసోంటి యువ లీడ‌ర్లు కూడా శాఖ‌లు ఇచ్చేశాడ‌ట‌. అందులో ఓ పాడె కౌశిక్‌, ఓ బాల్క‌సుమ‌న్‌, ఓ క్రిశాంక్ వీళ్లున్న‌రంట‌. ఇంకా ఎవ‌రెవ‌రికి ఏమేం శాఖ‌లివ్వాల్నో అని రామ‌న్న తెగ ఆలోచిస్తుంటే.. ఇవాళ సీన‌న్న సీఎం సీటుకే ఎస‌రు పెట్టినంత ప‌నిచేసిండు.

ఓ మీటింగు పోయిన త‌ల‌సాని శీన‌న్నను ప‌ట్టుకుని సీఎం.. సీఎం అని అరిచిండ్రంట‌. ఊక‌నే రెచ్చ‌గొడ్త‌తందుకు అరుస్తుండ్ర‌ని ఈయ‌న‌కూ తెలుసు. కామ్‌గా త‌న ప‌ని తాను చేసుకుని, వ‌చ్చిన మీటింగుల ఓవో నాలుగు ముచ్చ‌ట్లు చెప్పి అవ‌త‌ల ప‌డ‌క‌.. ఆగు ఆగు నేనూ సీఎంను అవుతా! కొంచెం టైం ఉంది! అని ఆన్స‌రిచ్చిండంట‌. ఇగ ఆడున్నోళ్లు ఒక్క‌టే ఒర్రుడు. అప్పుడే సీన‌న్న సీఎం అయిన‌ట్టుగా. ఆడ చిన్న‌బాసే సీఎం కోసం నిద్ర‌లేని రాత్రులు గడుపుతుండె. లేచిన‌కాడ్నుంచి త‌నే సీఎం అనుకునే తిరుగుతుండు. ఫామ్‌హౌజ్‌ల పెద్ద సారు కూడా కొడుకు సీఎం ఎప్పుడ‌యిత‌డా అని ఎదురుచూస్కుంటా.. పానం కాపాడుకుంటుండాయె.

Advertisement

ఇప్పుడేమో కొత్త‌గా సీఎం అని గీ సీన‌న్న బ‌య‌లుదేరిస‌ర్కి గులాబీ పార్టీల గిదే ముచ్చట చ‌క్క‌ర్లు కొడుతున్న‌దంట‌. మొన్న‌నే అన్న‌డు రామ‌న్న‌.. సీన‌న్న రామ‌స‌క్క‌నోడు…చూసి నేర్చుకోండ్రంద‌రు.. అని! ఇదేంది ఇప్పుడు నా సీటుకే ఎస‌రువెడ్తుండా! ఈ సీన‌న్న‌కు అంత సీన్ ఉందా తియ్‌! అనుకున్న‌డంట‌. ఇగ సీన‌న్న‌కు ఫోన్ల మీద ఫోన్లంట తెలంగాణ భ‌వ‌న్ నుంచి. పుసుక్కున గంత మాట‌న్న‌వెంద‌న్నా! అంద‌రికీ మంత్రుల శాఖ‌లు ఇప్పుడే పంచ‌వ‌ట్టిండు. ఇగ నీకు కూడా ఇయ్యాల్నో రేపో పంచుతందుకు మంచి శాఖ లెంకుతున్న‌డు…! ఉండ‌వ‌ట్ట‌లేక నువ్వు సీఎం అన‌వ‌డితివి! నీకేమ‌న్నా బుద్దుందానే! నీ..! అని పొల్లు పొల్లు తిట్టిడు షురూ సేశిండ్రంట‌! ఏ ఊకోర్రివ‌యా! నేను బీసీ లీడ‌ర్‌ను. గ‌ప్ప‌ట్ల పెద్ద‌సారు ద‌ళితుడ్ని సీఎం చేస్తాన‌ని మాటిచ్చిన‌ట్టు.. బీసీని సీఎం చేస్తాన‌ని పుసుక్కున అన్న‌డ‌న్కో.. అప్పుడు నేనే ముందు వ‌రుస‌ల ఉంట‌! అన్న‌డు.

అబ్బా పెద్ద ప్లానే తియ్‌! మ‌రి చిన్న‌సారు ఎటువోవాలె.. జాతీయ రాజ‌కీయాల‌ని ఢిల్లీల వోయి కూసుంట‌డా! ఏడ‌న్నా కూసుని వ‌యా! నేను సీఎం అయితే.. ఆయ్న వెన్క‌పొంటి అన్నీ తానై న‌డిపిస్త‌డు! ఎట్లైతేందీ! నేనూ ఓసారి సీఎం కావాలె.. నా కొడుకు మంత్రి కావాలె! మ‌ల్లా నీ కొడుకు ఏడికెంచి ఒచ్చిండు వ‌య్యా! అంతా మ‌రిచిపోయిర్రు క‌దా! కొడుకుని. కొడుకును ఓ పొజిష‌న్ల పెట్టాల‌నే క‌దా వ‌యా అంద‌రి ఆరాట‌మూ. నాకు కూడ్క అదే ఉంది. పెద్ద‌సారు రామ‌న్న‌ను సీఎం చేయాలె! చంద్ర‌బాబు లోకేశును సీఎం చేస్త‌డు..! నేను సీఎం అయినంక నా కొడుకు మంత్రైత‌డ‌న్న‌ట్టు.

Advertisement

అబ్బ క‌ల‌లు మ‌స్తుగ‌న్న‌వ్ గానీ, పెద్ద‌సారు ద‌ళితుడిని సీఎం చేస్తాన‌ని చేసిండా? ఆ సంగ‌తి గుర్తు పెట్టుకుని గ‌ప్‌చుప్‌గా నీకు ఏ శాఖ కావాల్నో పోయి రామ‌న్నకు చెప్పు. ఆయ‌న రెండు సార్లు సీఎం అయినంక .. అప్పుడు ఆలోచిద్దువు నువ్వు సీఎం అయితందుకు! రెండు సార్లు సీఎం అయిత‌డా? అప్పుడుగానీ ఈ కుర్చీ వ‌ద‌ల‌డా! అవ్ మ‌ల్లా ఇప్పుడు అదే ట్రెండ్ న‌డుస్తుంది క‌దా. రేవంతు కూడా రెండు సార్లు సీఎం అయినంక‌.. ఢిల్లీల చ‌క్రం తిప్పుత‌డ‌ట‌.. రామ‌న్న కూడా అదే అనుకుంటుండంట‌. కేసీఆర్ కూడా గ‌ప్ప‌ట్ల అదే అనుకున్న‌డు కానీ కాలం కలిసి రాలే బ్యాడ్ ల‌క్‌!

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×