E-Paper
Advertisement

Protein Veg Dishes: మజిల్ బిల్డింగ్ కోసం బెస్ట్ వెజ్ డైట్.. ఈ ప్రోటీన్ రిచ్ వంటకాలతో మీ ఆరోగ్యం పదిలం!

Protein Veg Dishes: మజిల్ బిల్డింగ్ కోసం బెస్ట్ వెజ్ డైట్.. ఈ ప్రోటీన్ రిచ్ వంటకాలతో మీ ఆరోగ్యం పదిలం!

Protein Veg Dishes: సాధారణంగా ప్రోటీన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చికెన్ లేదా గుడ్లు. వెజ్‌లో ప్రోటీన్ తక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ప్రకృతి సిద్ధంగా లభించే ఎన్నో రకాల పప్పు ధాన్యాలు, గింజలు , పాల ఉత్పత్తుల్లో శరీరానికి కావలసిన మేలైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కండరాల పుష్టికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి ఈ ప్రోటీన్ చాలా అవసరం. నిత్యం మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే.. శాకాహారం ద్వారానే పూర్తి ప్రోటీన్ పొందవచ్చు.

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పదార్థాలు:
1. పప్పు ధాన్యాలు:
మన భోజనంలో పప్పు తప్పనిసరి. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన పప్పులో సుమారు 15-18 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. నిత్యం భోజనంలో ఏదో ఒక పప్పు ఉండేలా చూసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అమినో యాసిడ్స్ అందుతాయి.

2. పనీర్, పాల ఉత్పత్తులు :
శాకాహారులకు పనీర్ ఒక అద్భుతమైన వనరు. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18-20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే పాలు, పెరుగు కూడా మంచి ప్రోటీన్ మూలాలు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కండరాల మరమ్మత్తుకు తోడ్పడుతుంది.

3. సోయా, సోయా చంక్స్ :
శాకాహారంలో ‘మీట్’ గా పిలువబడే సోయా చంక్స్‌లో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. 100 గ్రాముల సోయా చంక్స్‌లో దాదాపు 50 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది జిమ్‌కు వెళ్లే వారికి.. కండరాలు పెంచాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్. అలాగే సోయా పాలు , టోఫు కూడా మంచి ప్రత్యామ్నాయాలు.

4. శనగలు, చోలే :
నల్ల శనగలు లేదా కాబూలీ శనగల్లో ప్రోటీన్ , ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి తింటే కడుపు నిండుగా అనిపించడమే కాకుండా.. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయ పడతాయి. వీటిని ఉడకబెట్టి ‘సుండల్’ లాగా లేదా కూరలాగా తీసుకోవచ్చు.

Also Read: కేవలం 15 నిమిషాల్లో… తయారయ్యే రుచికరమైన లడ్డూలు, టేస్ట్ అదిరిపోతుందంతే!

5. పల్లీలు , నట్స్ :
మనకు సులభంగా దొరికే పల్లీలు (వేరుశనగలు) ప్రోటీన్ గనులు. గుప్పెడు పల్లీలలో మంచి కొవ్వులతో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌ను ప్రతి రోజూ నానబెట్టి తినడం వల్ల మెదడు ఆరోగ్యంతో పాటు శరీరానికి బలం చేకూరుతుంది.

6. పచ్చ బఠానీలు:
చాలా మంది కూరల్లో బఠానీలను పక్కన పెడుతుంటారు. కానీ ఒక కప్పు ఉడికించిన బఠానీలలో సుమారు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటితో పాటు విటమిన్ ‘ఎ’, ‘సి’ కూడా అందుతాయి.

7. చియా గింజలు , అవిసె గింజలు :
చియా సీడ్స్, గుమ్మడి గింజలు, అవిసె గింజలలో ప్రోటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని స్మూతీస్ లేదా సలాడ్స్‌లో వేసుకుని తీసుకోవచ్చు.

8. క్వినోవా :
ఇది ఒక పూర్తి ప్రోటీన్ కలిగిన ధాన్యం. ఇందులో శరీరానికి కావాల్సిన 9 రకాల ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఉంటాయి. బియ్యానికి బదులుగా క్వినోవాను వాడటం వల్ల బరువు తగ్గడంతో పాటు శక్తి పెరుగుతుంది.

Related News

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

వెజ్ ఓట్స్ ఉప్మా.. డయాబెటిస్ ఉన్నవారికి, డైట్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్!

Big Stories

×